CJI NV Ramana IAMC : మధ్యవర్తిత్వంతో వేగంగా కేసుల పరిష్కారం.. హైదరాబాద్‌లో దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన సీజేఐ !
హైదరాబాద్‌లో మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులకు సత్వ పరిష్కారం లభిస్తుందన్నారు.
న్యాయం ఆలస్యం అయితే నష్టం ఎక్కువగా ఉంటుందని భారత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవడం అన్ని విధాలా ఉపయోగకరమన్నారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ)ని భారత చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకరించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అభినందించారు. తాను చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించానన్నారు. సీఎం కేసీఆర్ సహకరించి వెంటనే మౌలిక వసతులు కల్పించారన్నారు.
ఈ కారణంగానే నాలుగు నెలల్లోనే ఐఏఎంసీ సిద్ధమయిదని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి వివాదాలను అయినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే మేలు జరుగుతుందని చీఫ్ జస్టిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్ అన్నివిధాలా అర్హమైనదని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి సీజేఐ ధన్యవాదాలు తెలియజేశారు. వివాదాల పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టం ఏర్పడుతుందన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసుల పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. తక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో పరిష్కారమే లక్ష్యమన్నారు. అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ పాత్ర కీలకమని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. [
Best practices across the world are being taken into consideration to ensure efficient functioning of the centre and for drafting of the rules: Chief Justice NV Ramana at International Arbitration & Mediation Centre Hyderabad pic.twitter.com/bWeZbeiYoQ
— ANI (@ANI) December 4, 2021
Also Read: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి
ఏఎంసీ ఏర్పాటులో సీజేఐ ఎన్వీ రమణ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల్లో సీజేఐ ఎన్వీ రమణ ఒకరని తెలిపారు. ఐఏఎంసీ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనేక అంశాల్లో హైదరాబాద్ త్వరలోనే నెంబర్‌వన్ కాబోతోందని కేసీఆర్ అన్నారు. నానక్‌రాంగూడలో ఐఏఎంసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణకు కేసీఆర్ అప్పగించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటయింది. శాశ్వత భవనం కోసం భూమి కేటాయించారు. నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేయనుంది.
Also Read: 20న కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు - పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశం !