(Source: ECI/ABP News/ABP Majha)
Ramoji Rao: రామోజీరావు చిత్ర పటానికి చంద్రబాబు నివాళి - రామోజీ కుటుంబసభ్యులకు తెలంగాణ సీఎం రేవంత్ ఫోన్
Hyderabad News: రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ చిత్రపటానికి చంద్రబాబు, టీడీపీ నేతలు నివాళి అర్పించారు.
Chandrababu Pays Tribute To Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, మీడియా దిగ్గజం రామోజీరావు (RamojiRao) చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), టీడీపీ నేతలు నివాళి అర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అక్షర యోధుడు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 'మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకం. ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి ఎవరికీ ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలు నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయం. మీడియా రంగంలో ఆయన ఓ శిఖరం. రామోజీరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం.' అని పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… pic.twitter.com/jYHQDFJdxF
— N Chandrababu Naidu (@ncbn) June 8, 2024
సీఎం రేవంత్ ఫోన్
అటు, రామోజీరావు కుటుంబసభ్యులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
లోకేశ్ సంతాపం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం రామోజీరావు అస్తమయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు.' అని ట్వీట్ చేశారు.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు… pic.twitter.com/e0lghpqWUj
— Lokesh Nara (@naralokesh) June 8, 2024
Also Read: Ramoji Rao Passed Away:ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయం