Ramoji Rao Passed Away:ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయం
Ramoji Rao: అనారోగ్యంతో బాధపడుతున్న ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఉదయం 4.50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.
మీడియా దిగ్గజం, తెలుగురాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచుతులైన రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 4.50 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఈనాడు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ గా ఉన్న రామోజీ రావు..ఈనెల 5న గుండె సంబంధిత సమస్యలతో హైదారాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి క్రిటికల్ సిచ్యుయేషన్ లో చికిత్స పొందుతున్న తెల్లవారుజామున కన్నుమూసినట్లు ఈనాడు సంస్థ అధికారిక ప్రకటన చేసింది.
ప్రస్తుతం ఫిల్మ్ సిటీలోని రామోజీ నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడి అనే చిన్నగ్రామంలో జన్మించిన రామోజీరావు...వ్యవసాయ కుటుంబానికి నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. అన్నదాత, మార్గదర్శి, ఈనాడు పత్రికలతో ఆయన తెలుగు వారందరికీ దగ్గరయ్యారు.
రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో రామోజీరావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈటీవీ నెట్ వర్క్, కళాంజలి, ప్రియాఫుడ్స్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఉషాకిరణ్ మూవీస్ తో పలురంగాల్లోకి ప్రవేశించిన రామోజీ ప్రతీ చోట విజయవంతమయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు సుమన్ 2012లో మృతి చెందారు.
#WATCH | Hyderabad, Telangana: Film director S. S. Rajamouli, Composer MM Keeravani and others pay last respects to Eenadu & Ramoji Film City founder Ramoji Rao at the Film City.
— ANI (@ANI) June 8, 2024
(Video Source: ETV) pic.twitter.com/VHAVmmrPup
ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై 58 సినిమాలను నిర్మించిన రామోజీరావు , జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, తరుణ్, విజయ్ దేవరకొండ లాంటి వారికి సినిమా ఇండస్ట్ర్లీలో తొలి అవకాశాలను అందించారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదో తేదీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు.
తెలుగు మీడియాను కొత్త పుంతలుతొక్కించిన రామోజీరావు చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యయాన్నే నిర్మించుకున్నారు. రైతు బిడ్డగా పుట్టిన ఆయన ఓ సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నారు. ఏదైనా కొత్తగా చేయడం ఆయనకు ఉన్న అలవాటు. పది ఏళ్ల భవిష్యత్‌ను ఇవాళే ఊహించడం కూడా ఆయనకు ఉన్న మరో గొప్ప లక్షణం. అలాంటి ఆలోచనలతో పురుడుపోసుకున్నవే ఆయన సంస్థలు. ప్రియా పచ్చళ్లు మొదలుకొని నేటి ఈటీవీ భారత్ వరకు చేసిన ప్రతీదీ చాలా స్పెషల్
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీ రావు తన స్వయం కృషితో మహా శక్తిలా ఎదిగారు. ఆయన చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా కచ్చితంగా ప్రజాదరణ పొందుతుందీ అంటే ఆయన కృషి అలాంటిది. 1974లో ఏర్పాటు చేసిన ఈనాడు దినపత్రిక అప్పట్లో పను సంచలనం రేపింది. అప్పుడే కాదు నేటికీ ఆ పేపర్ ప్రజల మనసులకు దగ్గరగా ఉంది. దీని వెనుక రామోజీ రావు పరిశ్రమ అనిర్వచనీయం.