CPI Narayana: అమిత్ షా పర్మిషన్ లేకుండా చంద్రబాబు అరెస్టుకు ఛాన్సే లేదు - సీపీఐ నారాయణ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు అరెస్టును సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన నిజంగా తప్పు చేసినప్పటికీ అరెస్టు చేసే పద్ధతి అది కాదని అన్నారు. అరెస్టుకు ముందు కనీసం గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని అన్నారు. 14 ఏళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయటం అప్రజాస్వామికమని నారాయణ అన్నారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని కె.నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. కచ్చితంగా అమిత్ షా పర్మిషన్ ఉందని కె.నారాయణ చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా బీజేపీ కుటిల నీతిని తెలుసుకోవాలని హితవు పలికారు. పులిని నమ్ముకుంటే ఏమవుతుందో చంద్రబాబు తెలుసుకోవానలి అన్నారు. కనీసం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ఆయన్న ఆఫీసుకు తీసుకెళ్లేలోపు దస్త్రాలు రెడీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
తిరుపతిలో సీపీఐ రామక్రిష్ణ స్పందన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్టు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు మరింత పెరిగిపోయాయని సీపీఐ రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పడే యోచన లేదని అపిస్తోందని అన్నారు. జగన్ మొగోడు అయితే తాడేపల్లిలో ఉండి అరెస్టు చేయించి ఉండాలని సీపీఐ రామకృష్ణ అన్నారు. ఇవాళ తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఐడీని జేపీఎస్ గా మార్చాలని, సీఐడీకి జగన్ ప్రైవేటు సైన్యంగా నామకరణం చేస్తే బాగుంటుందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సీఐడీ జగన్ ప్రైవేట్ సైన్యంలో పని చేస్తుందన్నారు. మార్గదర్శి విషయంలో గానీ, రఘురామకృష్ణం రాజు విషయంలో గానీ సీఐడీ వ్యవహార శైలి చూస్తే ప్రభుత్వంకు సన్నల్లో పని చేస్తుందనే విషయం అర్థమైందన్నారు.
రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కర్నూల్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీబీఐ ఏమీ చేయలేకపోయిందని, గెస్ట్ హౌస్ లో కూర్చున్న అవినాష్ రెడ్డి గడ్డి పీక్కుంటూ కూర్చున్నాడని, ఎంపీని అరెస్టు చేయాలంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురు అవుతుందని చెప్పిన పోలీసులు, చంద్రబాబు విషయంలో ఎందుకు లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచించలేదో ప్రజలందరికి తెలుసునన్నారు. పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేసేందుకు ఉన్నారని, సీఐడీ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు.
అమరావతి గురించి మాట్లాడినందుకు ఎంపీ జయదేవ్ పై కక్షపూరితంగా ప్రవర్తించడంతో పాటుగా అమరరాజా ఫ్యాక్టరీని ఇబ్బందుల్లోకి నెట్టాడని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముందు పోకుండా అవరోధాన్ని అధికార పార్టీ కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భయాందోళనకు గురి చేయడమే కాకుండా, అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. అన్ని పార్టీలు ఒకటై రౌడీ రాజ్యంను తరిమి కొట్టాలని ఆయన కోరారు.
జగన్ మొగోడు అయితే తాడేపల్లిలో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయించి ఉండాలని, కేంద్ర సహకారంతోనే జగన్ చంద్రబాబును అరెస్టు చేయించారనేది అర్ధం అయిందని అన్నారు. పుంగనూరు అల్లర్ల విషయంలో వందలాది మంది అమాయకులను జైల్లో పెట్టారని, పుంగనూరులో అల్లర్లకు వైసీపీ కారణం అని ఆరోపించారు. రాష్ట్రంలో దౌర్జన్య కాండ మితిమీరిపోయిందని అన్నారు. చంద్రబాబుని కలిసి సంఘీభావం తెలుపుతామని సీపీఐ రామకృష్ణ అన్నారు.