అన్వేషించండి

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు - రాష్ట్రానికి కేంద్రం కీలక ఆదేశాలు, డెడ్ లైన్ విధింపు

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము అడిగిన సమాచారం ఆదివారం లోగా ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది.

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ ఆల్టిమేటం ఇచ్చింది. ఆదివారంలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ ఓ లేఖ రాసింది. ఈ నెల 23 నుంచి 26 వరకూ కేంద్ర కమిటీ వంతెనను సందర్శించింది. ఈ సమయంలో ఆ బృందం నిపుణులు అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం కొంత మేర ఇవ్వగా, కమిటీ తిరిగి వెళ్లే ముందే వారు అడిగిన వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాసింది. మొత్తం 20 అంశాలతో కూడిన సమాచారం ఇవ్వాలని సూచించింది.

3 అంశాలకు మాత్రమే వివరణ

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలు పరిశీలించేందుకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఆ సమయంలో బృంద సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర అధికారులు కొంత సమాచారం ఇచ్చారు. అయితే, మొత్తం 20 అంశాల సమాచారాన్ని కోరగా, ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరోసారి పూర్తి సమాచారం కోరుతూ లేఖ రాశారు. ఆదివారంలోగా అడిగిన సమాచారం ఇవ్వాలని ఆల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ, సమాచారం ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లను లేనట్లుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలుంటాయని వెల్లడించారు. 

వారంలోగా నివేదిక

అయితే, మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్ల కుంగుబాటు తర్వాత బ్యారేజీని పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం వారంలోగా  సమగ్ర నివేదిక ఇవ్వనుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ బృందం ప్రాథమిక నివేదికలో పూర్తి వివరాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వ వివరణ అనంతరం పూర్తి నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఆ పిల్లర్స్ కు స్వల్పంగా పగుళ్లు

మరోవైపు, బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పిల్లర్స్ కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. పిల్లర్ కుంగుబాటు అనంతరం పరిస్థితులపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదట బ్యారేజీ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకూ పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్ పరిస్థితిపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం నిపుణులను సంప్రదించి నిర్మాణ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించనున్నారు. ఇప్పటికే దీనిపై ఓ షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది

కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద ఈ నెల 21న కుంగింది. భారీ శబ్దంతో బీ - బ్లాకులోని 18, 19, 20, 21 ఫిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఓ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే వంతెన కుంగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. బ్యారేజీ అకస్మాత్తుగా కుంగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా, ఈ ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget