By: ABP Desam | Updated at : 08 Feb 2023 05:49 PM (IST)
ఫామ్ హౌస్ కేసు వివరాలివ్వాలని ఐదు సార్లు సీబీఐ లేఖలు - పట్టించుకోని తెలంగాణ సీఎస్ !
CBI Letter To Telangana CS : ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు లేవు.కానీ సీబీఐ మాత్రం ఇంకా విచారణ ప్రారంభించలేదు. దీనికి కారణం ఏమిటన్నది తాజాగా బయటపడింది. ఫామ్ హౌస్ కేసు వివరాలివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఇప్పుటికే సీబీఐ హైకోర్టు తీర్పును అనుసరించి ఐదు సార్లు తెలంగాణ చీఫ్ సెక్రటిరీకి లేఖలు పంపింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు ఇవ్వాలని లేఖల్లో సీబీఐ పేర్కొంది. అయితే తెలంగాణ సీఎస్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.
సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. అయితే కోర్టు ఆదేశించే కేసుల్ని విచారణ చేయడానికి ఆటంకాలు ఉండవు. అయితే కేసుల వివరాలు ప్రభుత్వం హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఫామ్ హౌమ్ కేసు సీబీఐ చేతికి వెళ్లకుండా .. తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మళ్లి సింగిల్ బెంచ్‌లో పిటిషన్ వేసింది ప్రభుత్వం. సీజే అనుమతి కావాలని సింగిల్ చెప్పడంతో మళ్లీ సీజే వద్దకు వెళ్లారు. అంతుక ముందే ఎందుకైనా మంచిదని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడంతో హైకోర్టు సీజే బెంచ్.. సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసిది.
అదే సుప్రీంకోర్టులో అత్యవసరంగా విచారించాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేస్తే.. అంత తొందరేం లేదని సీజేఐ స్పష్టం చేశారు. పదిహేడో తేదీన విచారిస్తామని తెలిపారు. అదే సమయంలో స్టేటస్ కో ఇవ్వడానికి కూడా నిరాకరించారు. విచారణలో కేసు లో మెరిట్స్ ఉంటే హై కోర్ట్ తీర్పును రివర్స్ చేస్తామని సీజేఐ తెలంగాణ న్యాయవాదికి తెలిపారు. సిబిఐ చేతికి సాక్ష్యాలు వెళ్తే చేసేది ఏమీ లేదని వాదించినా సీజేఐ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో విచారణకు పదిహేడో తేదీ వరకూ ఆగాల్సి ఉంది.
ఇదే సమయంలో విచారణ ప్రారంభించడానికి సీబీఐకి ఎలాంటి అడ్డంకులు లేవు. సీబీఐ ఇప్పటికి మూడు సార్లు కేసు ఫైల్స్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. మరోసారి సీబీఐ లేఖ రాసింది. ఈ కేసు విషయం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులోనూ సీబీఐ విచారణ ఆపడానికి ఎలాంటి ఆదేశాలు రాలేదు. పదిహేడో తేదీ వరకూ సీబీఐ రాసిన లేఖలపై స్పందించకుండా ఉండే అవకాశం లేదు. అది కోర్టు ధిక్కరణ అవుతుంది. కేసు ఫైల్స్ సీబీఐ చేతికి వెళ్లకూడదని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇప్పటికీ కేసు ఫైల్స్ అప్పగించకపోతే.. కోర్టు ధిక్కరణ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఆ నలుగురు కలెక్టర్లే అంతా చేస్తున్నారు - వారి సంగతి చూస్తానని బండి సంజయ్ వార్నింగ్ !
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం
TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!