అన్వేషించండి

Telangana municipal elections 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం- 11న పోలింగ్, 13న ఫలితాలు

Telangana municipal elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ముగిసింది. బుధవారం పోలింగ్ జరగనుంది. శుక్రవారం ఫలితాలు వెల్లడవుతాయి.

Telangana municipal elections Campaign Close: తెలంగాణలో   మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో గెలుపు జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు శక్తివంచన లేకుండా శ్రమించాయి. సోమవారం సాయంత్రంతో మైకులు మూతపడటంతో, అభ్యర్థులు ఇప్పుడు అంతర్గత సమావేశాలు, ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో 48 గంటల పాటు  సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది.   రాజకీయ పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసింది.  

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం  116 మున్సిపాలిటీలు ,  7 నగరపాలక సంస్థల  ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలో ఉన్న 2,996 వార్డుల్లో  తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. మొత్తం 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా, వారి భవితవ్యాన్ని తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సుమారు 52 లక్షల 43 వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.      

ఎన్నికల నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సుమారు పాతిక వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని ఈసీ హెచ్చరించింది. సోషల్ మీడియా,  మొబైల్ ప్రచారాలపై కూడా ఆంక్షలు విధించారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలని కోరారు.        

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలని శ్రమిస్తున్నాయి.  పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  

టాప్ హెడ్ లైన్స్

KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget