అన్వేషించండి

KTR: పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు, మాపై బురద జల్లుతారా? - కేటీఆర్

KTR Comments: ప్రైవేటు వైద్య ఆస్పత్రులకు తాము అనుకూలంగా ఉండి ఉంటే.. హైదరాబాద్ చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్ ఆస్పత్రి ఎలా నిర్మిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

Telangana News: తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. సరైన వైద్యం అందక చిన్న పిల్లలు చనిపోతున్నారని తాము చెబుతుంటే.. వారిని సరైన మెడికల్ ట్రీట్మెంట్ అందించకుండా తిరిగి తమపైనే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రులకు తాము మద్దతు పలికామా అని ప్రశ్నిచారు. అనవసరంగా బీఆర్‌ఎస్ పార్టీపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకవేళ నిజంగానే ప్రైవేటు వైద్య రంగానికి తాము మద్దతు పలికి ఉంటే.. హైదరాబాద్ చుట్టూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్ ఆస్పత్రి ఎలా నిర్మిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

‘‘వైద్యం అంద‌టం లేదు... పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మ‌హ‌ప్రభో అంటే బుద‌ర జ‌ల్లుతున్నారు అని మాట్లాడ‌తారా? మీరు ఆరోపించిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాల‌నుకుంటే... హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుప‌త్రులు, వ‌రంగ‌ల్ లో న‌డుస్తున్న అతి పెద్ద ఆసుప‌త్రి, బ‌స్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసే వాళ్లమా?

కేసీఆర్ కిట్లు, త‌ల్లి - బిడ్డను ఇంటి ద‌గ్గర దిగ‌బెట్టేలా వాహ‌నాలు, సాదార‌ణ ప్రస‌వాలు జ‌రిగేలా చ‌ర్యలు తీసుకోవ‌టం, రెండు ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీలు ఉన్న చోట 33 మెడిక‌ల్ కాలేజీల ఏర్పాట్లు జ‌రిగేవా?

మాపై ఎదురుదాడి త‌ర్వాత‌, ముందుగా మీ పాల‌న‌లో ఉన్న లోపాలు స‌రిదిద్దుకోండి. పోయిన ప్రాణాలు తిరిగి రావు... ఆ త‌ల్లుల క‌డుపుకోత తీర్చలేము. ప్రజ‌లు కూడా మ‌న బిడ్డలే అని మాన‌వ‌త్వంతో ఆలోచిస్తే మీ ఆలోచించే ధోర‌ణితో పాటు మీ పాల‌న తీరు కూడా మారుతుంది. 

ఇప్పటికైనా మ‌ర‌ణాల‌పై రివ్యూ చేశారా...?  నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోక‌స్ చేశారా... లేదా?  మొన్నటి బ‌దిలీల్లో సీనియ‌ర్ డాక్టర్లను బదిలీపై పంపార‌న్న ఆరోప‌ణ‌ల్లో వాస్తవం ఉందా... లేదా? ఇది చెప్పండి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget