అన్వేషించండి

Kavitha In ED Office: ఢిల్లీ ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత, రాత్రికి అక్కడే! మధ్యాహ్నం కోర్టులో హాజరు

Kavitha Arrives in Delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు హైదరాబాద్ నుంచి ఆమెను ఢిల్లీకి తరలించారు.

BRS MLC Kavitha arrives in Delhi: ఢిల్లీ: మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి అధికారులు ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Office) కు తరలించారు. నేటి రాత్రికి ఆమె ఢిల్లీ లోని ఈడీ కార్యాలయంలోనే ఉండనున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి 4 గంటలపాటు కవితను విచారించారు. సాయంత్రం 5:20  గంటలకు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. నేటి రాత్రికి కవితను ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారని సమాచారం.

ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ 
ఈడీ ఆఫీసుకు తరలించేందుకు వేరే మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు. మీడియా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఎయిర్ పోర్టు నుంచి ఈడీ ఆఫీసుకు కవితను తరలించారు. ఈ సమయంలో ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు డాక్టర్ల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. మధ్యాహ్నం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అధికారులు తమ కస్టడీ కోరనున్నారు. మరోవైపు తన అరెస్టును కోర్టులో ఛాలెంజ్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇలాంటి కుట్రలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటాం 
ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడంపై కవిత ఘాటుగా స్పందించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని, ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని కవిత అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధైర్యపడొద్దని కుమారుడికి ధైర్యం చెప్పి ఆమె ఇంటి నుంచి ఈడీ అధికారులతో కారులో బయలుదేరారు. అరెస్ట్ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం ప్రకారం ఎదుర్కొంటామని కవిత అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Nithiin : నిర్మాత దిల్ రాజును దారుణంగా వాడేస్తున్న నితిన్.. మరీ ఇంతగానా!
నిర్మాత దిల్ రాజును దారుణంగా వాడేస్తున్న నితిన్.. మరీ ఇంతగానా!
Free Meal in Railway station : విమానం లాగా, రైలు ఆలస్యమైనా 'ఉచితంగా ఆహారం' - చాలామందికి ఈ విషయం తెలీదు
విమానం లాగా, రైలు ఆలస్యమైనా 'ఉచితంగా ఆహారం' - చాలామందికి ఈ విషయం తెలీదు
Embed widget