News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mynampalli : ముదురుతున్న మైనంపల్లి వివాదం - కుమారుడే ముఖ్యమని తేల్చేసిన ఎమ్మెల్యే !

మైనంపల్లి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు తన కుమారుడే ముఖ్యమన్నారు.

FOLLOW US: 
Share:

Mynampalli :  తనను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బదులిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. తన కుమారుడికి టిక్కెట్ ప్రకటించకపోవడానికి హరీష్ రావు కారణం అని ఆయనపై తిరుమలలో సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మరోసారి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కూడా ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించారు.   సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు.  హైదరాబాద్‌ వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు. తనకు  కుమారుడే ముఖ్యమని మైనంపల్లి స్పష్టం చేశారు.   జీవితంలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఇబ్బంది పెడితే కచ్చితంగా నేనూ బదులిస్తానన్నారు.                                                    

మెదక్‌, మల్కాజిగిరి కార్యకర్తలే తనకు ముఖ్యమన్నారు. తాను  ఏ పార్టీనీ విమర్శించనని..  పార్టీలకు అతీతంగా ఉంటానని స్పష్టం చేశారు.  మా అబ్బాయికి టికెట్‌ ఇస్తే.. గెలిపించుకుని వస్తా అని మైనంపల్లి హన్మంతరావు  స్పష్టం చేశారు.  తనకు మల్కాజిగిరితో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్‌ టికెట్‌ ఇస్తేనే బీఆర్ఎస్   తరఫున పోటీ చేస్తానని.. లేకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని సోమవారం  మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు.  మంత్రి హరీశ్‌రావు మెదక్‌లో పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవసరమైతే  హరీశ్‌పై పోటీ చేస్తానని పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో తన కుమారుడు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజాసేవ చేశాడన్నారు.                                                
 
హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నరు. కేటీఆర్ ఇప్పటికే తన ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. మైనంపల్లి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతనే టిక్కెట్ ప్రకటించారు.  దీంతో హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను పార్టీ పట్టించుకోలేదన్న అభిప్రాయం వినిపించింది. దీంతో పార్టీ నేతలు మైనంపల్లిపై విమర్శలు చేస్తున్నరు. తాజాగా కవిత కూడా స్పందించారు. 

మైనంపల్లి తన కుమారుడికి టిక్కెట్ విషయంలో తగ్గే అవకాశం లేదని..  ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్న- డిమాండ్ వినిపిస్తోంది.                                         

Published at : 22 Aug 2023 01:58 PM (IST) Tags: BRS Politics Mynampally Hanmantha Rao Mynampally controversy in BRS

ఇవి కూడా చూడండి

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

MLA Raja Singh: దమ్ముంటే ఆ పని చేయండి - సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్

MLA Raja Singh: దమ్ముంటే ఆ పని చేయండి - సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్

టాప్ స్టోరీస్

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు