KTR Comments: రేవంత్ రెడ్డి చీర నువ్వు కట్టుకుంటావా? లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Telangana News: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
KTR sensational comments against Revanth Reddy and Rahul Gandhi- నిర్మల్: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్పారంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ ప్రసంగంలో భాగంగా.. ఎన్నికల హామీ అయిన మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 జమ చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? మహిళలకు నెలకు రూ.2500 ఎక్కడ ఇస్తున్నారో చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి,
— KTR (@KTRBRS) May 5, 2024
నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?
తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు
వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని… pic.twitter.com/lI25q6Adgw
మీ అబద్ధాలపై ఆడబిడ్డలు ప్రశ్నిస్తున్నారు..
తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు తమ డబ్బులు ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ను అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే అన్నారు కేటీఆర్. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందన్నారు.
కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కిట్, పథకాలు బంద్
ఓవైపు కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచిపోయింది, తులం బంగారానికి అడ్రస్ లేదని కాంగ్రెస్ పాలనపై సెటైర్లు వేశారు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి ఉందన్నారు. ఇచ్చిన హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదన్నారు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదని అందరికీ తెలిసిపోయిందని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపాటు
మహిళలకు ప్రతినెలా ఇస్తానన్న రూ.2500 ఇవ్వలేదు కాబట్టి రేవంత్ రెడ్డి చీర కట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రూ.2000 పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ.4000 చేస్తామని మోసం చేసినందుకు చీర కట్టుకోవాలన్నారు. రైతు భరోసా 15,000 వెయ్యనందుకు, రైతుల పంటలకు నీళ్ళు ఇవ్వటం చేతకానందుకు, రైతులకు 2 లక్షల రుణమాఫి చేస్తానని మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చీర కట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కొరకు పరీక్షలు రాసే విద్యార్ధుల దగ్గర ఒక్క రూపాయి ఫీజు వసూలు చేయమని చెప్పి వేల రూపాయలు వసూలు చేస్తున్నందుకు, 24 గంటల కరెంట్ ఇవ్వటం చేతకానందుకు, ఇలా చెప్పుకుంటూ పోతే మస్త్ ఉన్నాయని కాంగ్రెస్ పాలనపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.