హైదరాబాద్‌ ఎంపీ స్థానం నుంచి మాధవీలత నామినేషన్‌ దాఖలు చేశారు.



ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. మాధవీలత మొత్తం ఆస్తి ₹221 కోట్లు



కుటుంబ చరాస్తుల విలువ రూ.165.46 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.55.92 కోట్లు



మాధవీ లతకు ఉన్న మొత్తం అప్పులు రూ.27.03 కోట్లు



విరించి లిమిటెడ్‌, వినో బయోటెక్‌లలో మాధవీ లత పేరుపై రూ.8.92 కోట్ల విలువైన షేర్లు



తన భర్త కొంపెల్ల విశ్వనాథ్‌ పేరు మీద రూ.56.19 కోట్ల విలువైన షేర్లు



గజ్వేల్‌ డెవలపర్స్‌, PKI సొల్యూషన్స్‌, విరా సిస్టమ్స్‌లలో తనకు రూ.16.27 కోట్ల షేర్లు, భర్తకు రూ.29.56 కోట్ల షేర్లు



ఇద్దరికి 5 కిలోల బంగారం.. అందులో 3.9 కిలోలు మాధవీ లతకు, 1.11 కిలోలు తన భర్తకు



సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు అఫిడవిట్ ప్రకారం లేవు.



మాధవీ లతపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది. పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసినట్లు పేర్కొన్నారు.