అన్వేషించండి

Harish Rao: ఇంత దిక్కుమాలిన సీఎం ఎవరూ లేరు - రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్

Telangana News: ‘‘అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao Vs Revanth Reddy: తెలంగాణలో రైతుల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తాము రుణమాఫీ గడువులోగా పూర్తి చేసినందున అన్న మాట ప్రకారం.. హరీశ్ రావు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గురువారం వైరా సభలో అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

‘‘రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు. అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బిఆర్ఎస్ మీద నామీద అవాకులు చెవాకులు పేలాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తాన్నన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు.

ఆగస్టు 15తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. అంటే 9వేల కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు.  సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నడు. మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? ఈ ఒక్కవిషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది.

మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి? నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బిఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు. రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాని నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, నువ్వు చేసిన పాపఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు గాను, దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా.

ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పండో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను’’ అని హరీశ్ రావు అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget