అన్వేషించండి

KCR for Farmers: రైతుల కోసం పోరాటం- రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు

కాంగ్రెస్ ప్రభుత్వం రైత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని, వారికిచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రైతు బంధు, పంట బోనస్ లాంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. మొదట ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిన విమర్శించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఆపై లోక్ సభ ఎన్నికలు రాగానే రైతు సమస్యలను లేవనెత్తుతూ కేసీఆర్ పొలం బాట పట్టి రైతులను పరామర్శించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం (మే 16న) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

సన్న వడ్లకు అనడం రైతుల్ని మోసం చేయడమే 
పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని.. ఇప్పుడు  సన్న వడ్లకు మాత్రమే బోనస్ అనడం రైతులను మరోసారి వంచించడం, మోసం చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే బోనస్ ఎట్లా ప్రకటిస్తదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ప్రకటన ద్వారా రాష్ట్ర రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు. ఓట్లు పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిపోయింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు?

ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు అన్నారు. ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఆగ్రహంతోనే ఉన్నారు. అసలే రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా కూడా ఇయ్యకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని విమర్శించారు. రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల కోసం పోరాడుతుందని, పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని గులాబీ బాస్ కేసీఆర్ బుధవారం నాడు పిలుపునిచ్చారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో  వడ్లను కొనకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఏడిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర రైతులకు భరోసా కల్పించడానికి ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోయి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Also Read: ఆడ రాక పాత గజ్జెలు అనే సామెత గుర్తొస్తుంది: కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget