(Source: ECI/ABP News/ABP Majha)
BJP MLA Raja Singh: టీఆర్ఎస్ నేతలకు అప్పుడు మాత్రమే జోష్ వస్తుంది.. సీఎం కేసీఆర్‌కు RRR సినిమా మొదలైందా..!
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పినట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది. రాజా సింగ్ తన విమర్శల దాడిని ఓ రేంజ్‌లో మొదలుపెట్టారు.
నవంబర్ 2 తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆర్ఆర్ఆర్ (రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్) సినిమా చూపిస్తారని హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆయన ఊహించినట్లుగానే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు.
ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా భారీ షాక్ తగలడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతుగా ఇంధన ధరలు తగ్గించాయి. కానీ తెలంగాణలో అలా జరగకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు కేవలం మాటలకే పరిమితమయ్యారని, చేతల్లో శూన్యమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై ఆలోచించడం లేదన్నారు.
Also Read: నాగశౌర్య తండ్రి ఫాంహౌస్‌లో పేకాట కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. అసలు సుమన్ ఎవరంటే..
ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం కారణమంటూ వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నేతలకు ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన విషయం కనిపించలేదా అని రాజా సింగ్ ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ నేతలకు ఊపు వస్తుందని.. కానీ చెప్పిన మాటలను ఆచరణలో పెట్టడం ఆ పార్టీ నేతలకు అలవాటు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజిల్‌పై కనీసం రూ.8 నుంచి రూ.10 వరకు ధర తగ్గించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
కేంద్రం నిర్ణయంతో ధర తగ్గించిన రాష్ట్రాలు..
కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చాయి. కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలిపి అసోంలో పెట్రోల్ రూ.12, డీజిల్ రూ.17 మేర తగ్గుతోంది. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గింది. గోవాలోనూ రూ.7చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్లు సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ ప్రకటించారు. అక్కడ పెట్రోల్ ధర రూ.12, డీజిల్ ధర రూ.17 మేర దిగొచ్చింది. మణిపూర్ లో పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.7 చొప్పున, బిహార్ లో పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90, త్రిపురలోనూ పెట్రోల్, డీజిల్‌పై రూ.7, ఉత్తర్‌ప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ రూ.12, గుజరాత్‌లో రూ.7 మేర ధర తగ్గించారు.
Also Read: Hyderabad: ఇదెక్కడి చోద్యం!! ఒకే నెంబరుతో మూడు ఆర్టీసీ బస్సులు.. ఎలా బయటపడిందో తెలుసా?