News
News
X

Kavitha Jantarmantar : మహిళా రిజర్వేషన్ల కోసం జనంతర్ మంతర్‌లో కవిత దీక్ష !

జంతర్ మంతర్‌లో తాము నిర్వహించాలనుకున్నధర్నా ప్లేస్‌ను బీజేపీ మార్చుకుంది. దీంతో కవిత దీక్షకు లైన్ క్లియర్ అయింది.

FOLLOW US: 
Share:

Kavitha Jantarmantar :   ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో  కవిత తలపెట్టిన  దీక్షకు లైన్‌ క్లియర్‌ అయింది.  జంతర్‌మంతర్‌ నుంచి ధర్నా వేదికను దీన్‌దయాల్‌ మార్గ్‌కు  బీజేపీ మార్చుకుంది.  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా చేయాలనుకుంది.  మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కవిత దీక్ష చేయాలని ముందుగా పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే ఉదయం జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా.. కొంచెం స్థలాన్ని  మాత్రమే వాడుకోవాలని లేకుంటే.. వేదికను మరో చోటకు మార్చుకోవాలని సూచిస్తూ.. సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్న కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని ఆంక్షలు విధించారు. మొత్తం స్థలం ఇవ్వలేం అని.. గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసి.. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ షరతుల క్రమంలోనే.. దీక్ష ప్రదేశాన్ని పరిశీలించారు కవిత. చివరికి పోలీసులతో జరిగిన చర్చల తర్వాత బీజేపీ తన ధర్నా స్థలాన్ని మార్చుకోవడతో సమస్య పరిష్కారం అయింది.                        

ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర దీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు కవిత. దేశవ్యాప్తంగా ఉన్న 29 పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నట్లు ప్రకటించారు.  మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్‌ అని భారత్‌ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.   27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసమే జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్నామని తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చింది. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్‌ స్టోరేజీలో పెట్టింది. ఈనెల 10న మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని మార్చి 2న పోస్టర్‌ రిలీజ్‌ చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు ముందుకొచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. 

సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే దేశం ఎలా విశ్వగురు అవుతుందని ప్రశ్నించారు. లోక్‌సభలో బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, ఆ పార్టీ తలచుకొంటే ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకొని బిల్లు తేవచ్చని చెప్పారు. : దేశంలో నారీశక్తిని ఏకంచేసి, మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేదాకా పోరాటం చేస్తామని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు.  పార్లమెంట్‌లో 14.4 శాతం మాత్రమే మహిళా ప్రతినిధులు ఉన్నారన్న కవిత.. పక్కనున్న పాకిస్థాన్‌లో 17 శాతం ఉన్నారని..  మహిళా రిజర్వేషన్లే సమస్యకు పరిష్కారమంటున్నారు. దాదాపుగా ఐదు వేల మంది ఈ మహిలా రిజర్వేషన్ల నిరసన దీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. 

Published at : 09 Mar 2023 06:04 PM (IST) Tags: Telangana Politics Delhi Liquor Scam women's reservation Kavita Deeksha at Jantar Mantar

సంబంధిత కథనాలు

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Komatireddy Venkat Reddy: అన్ని విషయాలూ మీడియాతో చెప్పుకోలేం - ప్రధానితో భేటీ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: అన్ని విషయాలూ మీడియాతో చెప్పుకోలేం - ప్రధానితో భేటీ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

టాప్ స్టోరీస్

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !

AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !