BRS Income: ఊహించనంత పెరిగిన బీఆర్ఎస్ సంపద, ఒక్క ఏడాదిలోనే - తాజా ఆదాయం ఎంతంటే!
ఈ ఏడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఇన్‌కం వచ్చినట్లుగా బీఆర్ఎస్ వెల్లడించిన ఈ నివేదికలో వెల్లడించింది. ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేదు.
భారత రాష్ట్ర సమితి పార్టీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే పెద్ద ఎత్తున పెరిగింది. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన ఓ నివేదిక ద్వారా ఈ వివరాలు బయటికి వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ రిపోర్టును పార్టీలు సమర్పిస్తుండగా.. ఈ ఏడాది కూడా 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం.. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆదాయం 2021-2022 మధ్య కాలంలో ఊహించనంతగా పెరిగింది. ఏకంగా రూ.37.65 కోట్ల నుంచి రూ.218.11 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఇన్‌కం వచ్చినట్లుగా బీఆర్ఎస్ వెల్లడించిన ఈ నివేదికలో వెల్లడించింది. ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేకపోవడం విశేషం. ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఒకే ఒక సంవత్సరంలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరిపోయింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాల పరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్ల నిధులు జమ చేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్ల దాకా ఉన్నాయి.
వివిధ రూపాల్లో భారత రాష్ట్ర సమితికి ఆదాయం ఇలా..
31 మార్చి, 2022 31 మార్చి, 2021
రుసుములు, చందాలు 8,04,74,020 17,26,72,730
వ్యక్తిగత డొనేషన్లు 90,00,000 1,00,02,379
కంపెనీలు, సంస్థల నుంచి - 3,15,00,000
ఎలక్టోరల్ బాండ్లు 153,00,00,000 -
ఎలక్టోరల్ ట్రస్టులు 40,00,00,000 -
సాధారణ డొనేషన్లు 3,75,733 3,03,821
ఇతర ఆదాయం 16,12,71,981 16,21,06,932
మొత్తం నిధులు 218,11,21,734 37,65,85,862
ఖర్చులు 27,93,90,799 22,34,86,499
నికర ఆదాయం 190,17,30,935 15,30,99,363
ఓపెనింగ్ బ్యాలెన్స్ 307,61,37,204 292,30,37,841
జనరల్‌ఫండ్‌కి చేరిన మొత్తం 497,78,68,139 307,61,37,204
తాజా మొత్తం ఆస్తుల విలువ 480,75,88,894 288,24,57,519