అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

TS Police Job Recruitment: ఫిజికల్ ఈవెంట్లలో లోపాలు, అవకతవకలు - సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

TS Police Physical Events: పోలీస్ నియామకాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని కోరారు.

Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణ పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా  డిసెంబరు 8న మొదలైన ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు జనవరి 3 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 12 మైదానాల్లో పీఈటీ, పీఎంటీ నిర్వహిస్తున్నారు. అయితే పోలీస్ నియామకాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

‘రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన దేహధారుడ్య పరీక్షలను నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్ లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడంవల్ల దాదాపు 2 లక్షల మంది పురుష, మహిళా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు మా దృష్టికి వచ్చింది. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.’ అని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. 


‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల (సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్) నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురదృష్టకరం. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరం. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్ కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయం’ అన్నారు.

‘దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ డిస్టన్స్ 3.8  మీటర్లుగానే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంవల్ల అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. లాంగ్ జంప్ తోపాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలి. లాంగ్ జంప్ లో ఆన్ ది లైన్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకుగాను అభ్యర్థులందరికీ మార్కులు కలపాలని కోరుతున్నాం. తక్షణమే జరిగిన తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం అని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ పలు విషయాలు ప్రస్తావించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget