Bandi sanjay : ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలి అనుకునేవాడు మూర్ఖుడు - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకోవడం మూర్ఖత్వమని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు.
Bandi sanjay : ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి అనుకోవడం మూర్ఖత్వమని తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలి అనుకునేవాడు మూర్ఖుడని..తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోవట్లేదని స్పష్టం చేశారు. ములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. భాజపా అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని భావించడంలేదని, అలా ప్రచారం చేసుకోవడం కూడా సరికాదన్నారు.
గవర్నర్‌కు భయపడుతున్నకేసీఆ్
గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ ప్రవాస్ యోజనలో భాగంగా వేములవాడకు చేరుకున్న ఆయన పలు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలతో ముందుగా రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వర గార్డెన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు కాని హామీలను ఇస్తూ వాటి బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు గవర్నర్ తమిళసైకి భయపడుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, ఐవైసీ అన్నదమ్ములని విమర్శ
ఎంఐఎం నాయకుడు ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదమ్ముల లాంటి వారిని రాజకీయం కోసం కేసీఆర్ రాజకీయ వ్యభిచారిగా మారాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇందులో సగం మందికి కూడా ఎన్నికల నాటికి బీఫామ్ ఇవ్వరని ఆయన జోష్యం చెప్పారు. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే పేర్లను ప్రకటించాడని చెప్పారు. 30% కమిషన్ అంటే కేసీఆర్ కుటుంబమని అవినీతి పరిపాలన కేసీఆర్‌కే సాధ్యమైందని విమర్శించారు.అధికార పార్టీ దగ్గర ఎంఐఎం డబ్బులు తీసుకోవడం అలవాటుగా మారిందని విమర్శించారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటే కేసీఆర్ మాత్రం చంద్రమండలం కింద వ్యాపారం చేయాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. దాదాపు 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసి వారికి డబ్బులు కూడా సమకూర్చి గెలిచాక బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలని కుట్ర రాజకీయాలు కూడా చేస్తున్నారని ఆరోపించారు.
సర్వేల ఆధారంగా బీజేపీలో టిక్కెట్లు ఇవ్వరు !
సర్వేల ఆధారంగా బీజేపీలో టికెట్ ఇచ్చే విధానం ఉండదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎక్కడ నుండి పోటీ చేయాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తుండగా ప్రజల్లో మంచి స్పందన ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కర్నాటక, తమిళనాడు, యూపీ, అసోంకి చెందిన ఎమ్మెల్యేలు సీకే రామస్వామి, బస్వరాజ్, ధర్మేశ్వర్ కోన్వర్, దిగంత కలిత, మునిరాజ్, శశాంక్ త్రివేది, హేమంత తగురియాతోపాటు పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ తదితరులున్నారు.