![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raghu Rama Krishna Raju Case: రఘురామకు టార్చర్ కేసులో మాజీ అధికారి విజయ్‌పాల్ అరెస్టు, నెక్ట్స్ ఏంటి?
![Raghu Rama Krishna Raju Case: రఘురామకు టార్చర్ కేసులో మాజీ అధికారి విజయ్‌పాల్ అరెస్టు, నెక్ట్స్ ఏంటి? Former CID Officer Vijayapal Arrested in Raghu Rama Krishna Raju Custodial Torture Case Raghu Rama Krishna Raju Case: రఘురామకు టార్చర్ కేసులో మాజీ అధికారి విజయ్‌పాల్ అరెస్టు, నెక్ట్స్ ఏంటి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/f6cd102ca30978c2746728704e58edf31732632610032233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Former CID Officer Vijayapal Arrested | ఒంగోలు: ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఆరోపణలున్నాయి. రఘరామను వేధించిన కేసు (Raghu Rama Krishna Raju Custodial Torture Case)లో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్.విజయ్‌పాల్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విజయ్‌పాల్ కు నోటీసులు రావడంతో మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు ఆయన హాజరయ్యారు. ఉదయం నుంచి దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం రాత్రి 7గంటల సమయంలో విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.
నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో, వైసీపీ హయాంలో రఘురామ కృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాంతో నేడు ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విజయ్ పాల్ విచారణకు హాజరుకాగా, సుదీర్ఘ విచారణ అనంతరం సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు మరికాసేపట్లో విజయ్ పాల్ అరెస్టుపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో జరిగిన దాడులు, సోషల్ మీడియా పోస్టులు, దుష్ప్రచారంపై కూటమి ప్రభుత్వంలో వరుస కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదై విచారణలో జాప్యం జరిగిన కేసుల్లో సైతం కదలిక వస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)