అన్వేషించండి

Bandi Sanjay: నీతి, నిజాయితీగా ఉండే గవర్నర్ బీఆర్ఎస్ కు నచ్చరు: బండి సంజయ్

Bandi Sanjay: నీతిగా, నిజాయితీగా ఉండే గవర్నర్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి నచ్చరంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లు చేశారు. 

Bandi Sanjay: రాష్ట్ర గవర్నర్ తమిళీసై సౌందర రాజన్ పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. నీతిగా, నిజాయితీగా ఉండే గవర్నర్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి నచ్చరంటూ కామెంట్లు చేశారు. రబ్బరు స్టాంపు మాదిరిగా ఉండే గవర్నర్లు మాత్రమే వాళ్లకు నచ్చుతారంటూ విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ ను హేళన చేయడం, కనీసం మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం దారుణం అన్నారు. ఇదంతా రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను చూసీ చూడనట్లుగా.. గవర్నర్ వ్యవహరిస్తే అంతా బాగుండేదంటూ విమర్శనాస్త్రాలు విసిరారు. కానీ తమిళిసై అలా చేయకపోవడం, వారు చేసే అవినీతిని అడ్డుకోవడం వల్లే ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో కూడా ఉండడం లేదని ఫైర్ అయ్యారు. ఈ మధ్య సీఎం కేసీఆర్ తరచుగా మహారాష్ట్రకు వెళ్తున్నారని గుర్తు చేసిన బండి సంజయ్... ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రా, మహారాష్ట్రకు ముఖ్యమంత్రా అంటూ ప్రశ్నించారు. ముందు రాష్ట్ర ప్రజల సమస్యలు విని పరిష్కరించాకా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లండంటూ సూచించారు. 

అసలు గవర్నర్ పై మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్లు ఏంటంటే..?

వైద్యశాఖపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన వ్యాఖ్యలు విచారకరం అని ఆ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆమె ఉస్మానియా ఆస్పత్రి గురించి అలా మాట్లాడడం సమర్థనీయం కాదని అన్నారు. అసలు ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించి అయినా ఆమె మాట్లాడారా అంటూ నిలదీశారు. బుధవారం (జూన్ 28) మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ గవర్నర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని, అసలు ఆసుపత్రికి భవనం పనికిరాదని గతంలో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం తెలిపిందని, ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని 2015లోనే కట్టాలని సీఎం కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కొత్త భవనం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఉస్మానియా డాక్టర్లు బాగా పని చేశారని కొనియాడారు. గవర్నర్‌కు వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆమె ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. వైద్య రంగంలో కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నామని చెప్పారు.

గవర్నర్‌ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అనవసరంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని.. కంటి వెలుగులాంటి కార్యక్రమాన్ని మెచ్చుకునేందుకు గవర్నర్‌కి మనసు రాలేదని అన్నారు. నిమ్స్‌లో పడకల పెంపుపై ఆమె ఎందుకు స్పందించలేదని, కనీసం ఒక్క ట్వీట్‌ కూడా ఎందుకు చేయలేదని అన్నారు. మాతా శిశుమరణాలు తగ్గించడంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ చెబితే గవర్నర్‌కు కనిపించదని అన్నారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడడం దురదృష్టకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచి కనబడదు, వినబడదు అనే తరహాలో తమిళిసై వ్యవహారశైలి ఉందని అన్నారు. గవర్నర్‌ తీరులో రాజకీయమే స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget