BJP Reaction On Komatireddy : కాంగ్రెస్ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయింది - అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామన్న తెలంగాణ బీజేపీ !
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బరిలోనుంచి వెళ్లిపోయిందని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలే దానికి నిదర్శనమన్నారు.
BJP Reaction On Komatireddy : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాలు మాత్రమే గెలుస్తుందంటూ ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయిందని .. ఎవరైనా గెలుస్తామని చెప్తారు కానీ కాంగ్రెస్ ఒడిపోతామని చెపుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓడిపోతామని తెలిసికూడా యాత్రు ఎందుకని .. ఆయన ప్రశఅనించారు. త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ -2 మొదలుక పెడతమని.. అధికారాన్ని చేజిక్కించుకుంటామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.
త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ -2
బీఆర్‌ఎస్ పార్టీ కలలుగనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలన ,అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ బీటీం కాంగ్రెస్ పార్టీ అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్నారు. 119 స్థానంలో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. 119 స్తానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఎన్నికలకు ముందు సపరేటుగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అన్నారు. మోడీ నిజాయితీపరులు కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంకా ఈటెల రాజేందర్ ఆయన మనిషి అనుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందన్న బండి సంజయ్
తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి పై బీజేపీ పై నమ్మకం ఉందని, ప్రధానమంత్రి నేతృత్వంలో తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి గల్లి స్థాయి నుంచి ఢిల్లీ పంజాబ్ స్థాయి వరకు వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రజల సమస్యలపై కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని విమర్శించేందుకు పెట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందని సెటైర్లు వేశారు. ఎన్నికల వరకూ పొట్లాడుకున్నట్లుగా నటిస్తారని.. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే చేశారా ? కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకున్నారా ?
కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఆయన కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ వచ్చిన తర్వాత ఆయన మళ్లీ గాంధీ భవన్ కు వచ్చారు. అయినప్పటికీ ఇలా .. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలవలేదని.. బీఆర్ఎస్ పార్టీతో కలిసిపోవాల్సిదేనన్నట్లుగా వ్యాఖ్యానించడంతో ఇదందా వ్యూహాత్మకగా జరుగుతున్న పొలిటికల్ గేమ్ అని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.