అన్వేషించండి

Bandi Sanjay On BRS : కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు - మేడిగడ్డను ఎన్ని సార్లు చూస్తారని బండి సంజయ్ ప్రశ్న

Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. మేడిగడ్డపై నిపుణుల నివేదిక వచ్చాక చూసేదేమిటని ప్రశ్నించారు.

Bandi Sanjay On BRS :    ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్ లో కాళేశ్వరం వెళ్లొచ్చారు. ఇంజనీరింగ్ నిపుణుల బ్రుందం వెళ్లి విచారణ జరిపి నివేదిక కూడా ఇచ్చింది. కేంద్ర బ్రుందం కూడా ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇచ్చింది. మళ్లీ సీఎంసహా మంత్రులంతా వెళ్లాల్సిన అవసరం ఏముంది?..  అని బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ ప్రశ్నించారు.  కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, క్రిష్ణా నీటిపై నల్గొండలో సభ పేరుతో బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయని విమర్శించారు. కరీంనగర్  పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తున్న ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు.  విలువైన అసెంబ్లీ సమయాన్ని వ్రుధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాయ్’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేశానని ముక్కు నేలకు రాసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అట్లాగే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు.

బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేశారు ? 

ప్రజాహిత యాత్రలో భాగంగా 4వ రోజు మధ్యాహ్నం కోనరావుపేట మండల కేంద్రానికి  బండి సంజయ్ వచ్చారు.   మీకోసం బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశారని దేశమంతా చర్చ జరుగుతోంది. మోదీ ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు తెలంగాణకు ఇస్తే.. కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూం కట్టియ్యలే. మీ కోసం 16 వందల కిలోమీటర్లు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసిన. త్యాగాలు మేం చేస్తే భోగాలు కాంగ్రెస్ అనుభవిస్తోంది.  ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రైతులకు రుణమాఫీ రూ.2లక్షలు, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు బంధు ఇయ్యలే. 6 గ్యారంటీలకు దిక్కులేదు. మీరు ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ చేసిన మేలు ఏంది? అని ప్రశ్నించారు. 

భారీగా  నిధులు మంజూరు చేసినా ఓట్లెయ్యలే ! 

మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం భారీ ఎత్తున నిధులిచ్చింది. ఒక్క వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.575 కోట్ల 91 లక్షల రూపాయలిచ్చింది.  ఈ ఒక్క మండలానికి ఉపాధి హామీ కింద రూ.48 కోట్ల 25 లక్షలిచ్చింది. రోడ్ల మెటీరీయల్ కోసం 23 కోట్ల 25 లక్షలు, మొక్కల పెంపకానికి 33 కోట్ల 91 లక్షలిచ్చింది. ఆ నిధులేమైనయని అడిగితే వర్షాలకు మొక్కలు కొట్టుకుపోయాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నరు. మీరే ఆలోచించండి. ఇతర పనుల కోసం రూ.19 కోట్ల 52 లక్షలు, చెత్త సేకరణ కోసం రూ.16 లక్షలు, టాయిలెట్ల కోసం 2 కోట్లకుపైగా, కిసాన్ సమ్మాన్ నిధి రోడ్ల కోసం రూ.3 కోట్లు ఇచ్చినం.  కొనరావుపేట గ్రామానికి రూ.9 కోట్లకుపైగా నిధులిచ్చినం. బండి సంజయ్ చెప్పింది తప్పయితే నాపై కేసు  పెట్టండి. అట్లాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను మీరేమిచ్చారని నిలదీయండి… మేం ఇన్ని పనులు చేస్తుంటే.. ఇన్ని నిధులు ఇస్తుంటే బీజేపీకి ఓటేయకపోవడం ఎంత బాధాకరమని ఆయన ప్రశ్నించారు. 

అసెంబ్లీలో నిమిషానికి రూ. ఇరవై వేలు ఖర్చు

అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు కాళేశ్వరం మీద డ్రామాలాడుతోంది. బీఆర్ఎస్ నేతలు క్రిష్నా నీటి నాటకాలాడుతున్నరు. అసెంబ్లీలో నిమిషానికి రూ.20వేలు ఖర్చవుతుంది. ఈ లెక్కన సభ నిర్వహణ కోసం కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ప్రజా సమస్యలను, వాళ్లకిచ్చిన హామీలను గాలికొదిలేశారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరి ముఖాలు ఒకరు టీవీల్లో కన్పించేందుకు పోటీలు పడి డ్రామాలాడుతున్నరు. ఒకరికొకరు తిట్టుకుంటరు తప్ప వాటిపై చర్యలుండవు. ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోరు.  10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఆస్తులు పెరిగినయే తప్ప.. ప్రజల ఆస్తులు పెరిగినయా?  బీఆర్ఎస్ నేతలు గుడిని మింగితే.. కాంగ్రెసోళ్లు గుడి లింగాన్ని కూడా మింగేస్తరన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget