అన్వేషించండి

Bandi Sanjay: 8వ నిజాం అంత్యక్రియలకు అధికార లాంఛనాలు, హిందూజాతరలు పట్టించుకోరా? - బండి సంజయ్

నిజాం వారసుడు పరాయి దేశంలో చనిపోతే హైదరాబాద్ కు తీసుకొచ్చి అత్యున్నత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న కేసీఆర్ ఆదివాసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు.

హిందూ జాతరలను సీఎం కేసీఆర్ పట్టించు కోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు. అదే సమయంలో నిజాం వారసుల మృతదేహాలను స్వాగతిస్తున్నారని, సకల మర్యాదలు ఇస్తున్నారని అన్నారు. హిందువుగా పుట్టడం అదృష్టం అని, పూర్వ జన్మ సుకృతం అని బండి సంజయ్ అన్నారు. సెలబ్రిటీలు చనిపోతే వెళతారు కానీ, గిరిజన ప్రాంతాల్లో పర్యటించబోరని, పోడు భూములకు పట్టాలివ్వరని అన్నారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన నిజాం వారసుడు పరాయి దేశంలో చనిపోతే హైదరాబాద్ కు తీసుకొచ్చి అత్యున్నత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న కేసీఆర్ ఆదివాసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు.

గతంలో పోడు భూములు సాగుచేసుకొనే రైతులకు కుర్చీ వేసుకుని పట్టాలిప్పిస్తా అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అటవీశాఖ అధికారులను పంపి కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఆదివారం (జనవరి 22) కేస్లాపూర్ నాగోబా జాతర సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ జాతరకు ఆయన కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కలిసి హాజరయ్యారు.

ఇదే కేసీఆర్ కు ఆఖరి అవకాశం అని, బడ్జెట్ లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించాలని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన అని అన్నారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కుట్ర చేశారని గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు.

ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తామని అన్నారు. 

అంతకుముందు కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కలిసి నాగోబా జాతరకు వచ్చిన బండి సంజయ్‌‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. మెస్రం వంశం పక్షాన బండి సంజయ్ కు, అర్జున్ ముండాకు ఆదివాసీలు స్వాగతం పలికారు. బండి సంజయ్ రాకతో నాగోబా జాతరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా జాతర దర్బార్ కు హాజరై ఆదివాసీలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందరికీ నాగోబా జాతర శుభాకాంక్షలు తెలిపారు. 

టీఆర్ఎస్ దివాళా పార్టీ
టీఆర్ఎస్ పార్టీ దివాళ తీసిన కంపెనీ అని, అందుకే బీఆర్ఎస్‌గా మార్చారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చాక అన్ని జాతరలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

 కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ నాగోబా జాతరకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆదివాసులే అటవీప్రాంత యజమానులని చెప్పారు. అటవీ చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. నాగోబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని అర్జున్ ముండా చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
CM Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, ఎవరికీ అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget