Bandi Sanjay : ఆర్టీసీ బిల్లును అడ్డుకుంటోంది కేసీఆరే - బండి సంజయ్ ఆరోపణలు
ఆర్టీసీ బిల్లును కేసీఆర్ అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పంట నష్ట పరిహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay : ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రేపు ఎదైనా సమస్య వస్తే గవర్నరే బాధ్యత వహిస్తారని.. అర్టీసి ఆస్తులు అమ్మె ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. పంట నష్టం గురించి మాట్లాడుకోవద్దనే అర్టీసి విలినం అంశం లేవనెత్తారన్నారు. ముఖ్యమంత్రి ది రాక్షస బుద్ది అని.. గవర్నర్ ని బద్నా చేసే పనిలో ఉన్నాడని ఆరోపించారు. ఆర్టీసి కార్మికులకి న్యాయం చేసే అంశాన్ని గవర్నర్ పరిశీలిస్తున్నారని స్పష్టం చేశారు. ఆర్టీసి కార్మికులు దయచేసి అలోచించాలని సూచించారు. రెండు రోజులలో అర్టీసీ విలినం చేస్తే రేపు న్యాయపరమైన ఇబ్బందులు వస్తే గవర్నర్ బాధ్యతలు వహించాలన్నారు. ఆర్టీసి విలీనం గురించి చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు.
గవర్నర్ నాలుగు రోజులు కూడా పరిశీలించకూడదా అని బండి సంజయ్ ప్రశ్న
గవర్నర్ పేరు చెప్పి ఆర్టీసీ విలీనాన్ని కేసీఆరే అడ్డుకుంటున్నారని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదన్నారు బండి సంజయ్. కార్మి్కులకు న్యాయం చేయాలనే గవర్నర్ చూస్తున్నారని వెల్లడించారు. ఆర్టీసీని విలీనం చేయడానికి కేసీఆర్ నాలుగేళ్ల పాటు ఆలోచించారని.. గవర్నర్ నాలుగు రోజుల పాటు కూడా ఆలోచించకూడదా ్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట నష్టంపై సీఎం కేసీఆర్ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వల ప్రాజెక్టును ఆయన 2023 ఆగస్టు 05 శనివారం రోజున సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ చేస్తామని, పంటనష్టం ఇస్తామని కేసీఆర్ మోసపు హామీలు ఇచ్చారని సంజయ్ ఆరోపించారు.
గవర్నర్ అడిగిన సమాచారం.. వివరణలు ఇచ్చిన ప్రభుత్వం
ఆర్టీసీ బిల్లులపై గవర్నర్ తమిళిసై ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమాధానలతో కూడిన లేఖను రాజ్‌భవన్ కార్యదర్శికి ప్రభుత్వం పంపింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తరువాత వారికి ఇప్పటికన్నా మెరుగైన జీతాలు ఉంటాయని అందులో ఉంది. విలీనం తర్వాత విధివిధానాల్లో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ వివాదాన్ని ఏపీ ప్రభుత్వం డీల్ చేసిన మాదిరిగా ఇక్కడా చేస్తామన్నారు. ప్రస్తుత చట్టపరమైన సంస్థ రూపంలోనే ఆర్టీసీ పని చేస్తుందని వివరణ ఇచ్చారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు కార్మికసంఘాల నేత థామస్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు.
ఆర్టీసీ సంఘాల నేతలతో మాట్లాడిన గవర్నర్
అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి వివరణ అందలేదని .. వివరణ అందాక గవర్నర్ ఆమోదిస్తామన్నారని థామస్ రెడ్డి చెప్పారు. సత్వర పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ హమీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులను న్యాయం జరగాలని గవర్నర్ అన్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్న నమ్మకం ఉందన్నారు.