Ask Kavitha : రాజకీయాల్లో పావును కాబోను - బీఆర్ఎస్‌దే వంద శాతం గెలుపు - ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు కవిత ఆసక్తికర సమాధానాలు
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 95-105 స్థానాలు సాధిస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తప్పులేన్నారు. ఎక్స్‌లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఇవే
Ask Kavitha : రాజకీయ నేతలు సోషల్ మీడియాలో ప్రజలతో టచ్‌లో ఉండటం కామన్‌గా జరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ప్రశ్న- జవాబు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆస్క్ మీ పేరుతో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సూటి ప్రశ్నలు ఎదురైనా తనదైన పద్దతిలో సమాధానాలిచ్చారు. ఓ నెటిజన్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ పాత్రేమిటో సూటిగా చెప్పాలన్నారు. అయితే తనకే తెలియదని..అందులో అసలు తన పాత్రే లేదని కవిత సూటిగా స్పష్టం చేశారు.
Archana Ji
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2023
Ask anything reasonable you’ll get an answer … I have no clue about the scam as I have no role in it …. https://t.co/dW8SFgUJTl
మహిళా రిజర్వేషన్లపై పోరాడామని చెప్పుకుంటారని కానీ మీ పార్టీలో ఎందుకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించలేదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. వెంటనే చట్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారని..కానీ బీజేపీనే చేయలేదని కవిత గుర్తు చేశారు.
Our leader KCR Garu has appealed for the Immediate implementation of the women's reservation bill in this election, whereas the BJP deceived women of this country by giving a " post-dated check " while the congress remained a mute spectator. https://t.co/D4FexG4rv9
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2023
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తుందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయని ఓ నెటిజన్ అడిగారు. అయితే కవిత మాత్రం ఇవన్నీ కాంగ్రె్స మార్క్ ప్రచారాలని గత ఎన్నికల్లోనూ అలాగే ప్రచారం చేశారన్నారు. ఈ సారి కూడా వంద శాతం బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.
They played the same trick in 2018. Many surveys were thrown at the people in 2018 as well .. but BRS won with a thumping majority. Let Congress & others win the surveys this time also & BRS will win the election! #KCROnceAgain https://t.co/V4cjWkNEOQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2023
తెలంగాణ బీసీ సీఎం నినాదంపైనా ఒకరి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బీసీ స్టేట్ చీఫ్‌ను తీసేసి ఓసీకి పదవి ఇచ్చారని.. బీసీ కులగణన కూడా చేపట్టడం లేదని గుర్తు చేశారు. మహిలా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లపైనా స్పందించలేదన్నారు. ఇది ఒక ఎలక్షన్ జిమ్మిక్కేనని కవిత స్పష్టం చేశారు.
BJP Telangana replaced its BC leader who was the State president & gave it to an OC. BJP at center refuses to conduct OBC caste census across India. BJP refuses to give reservation to OBC women. BJP refuses to form BC welfare ministry at the centre. BJP refuses to give a 33% OBC… https://t.co/oraTt8outk
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2023
బీఆర్ఎస్‌కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని .. ఫలితాలపై ఎంత నమ్మకం ఉందని ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ పై అభిప్రాయం అడిగిన ఓ నెటిజన్ కూ సమాధానం ఇచ్చారు. ఈ వయసులో ్లఅలా జరగడం కరెక్ట్ కాదని.. వారి కుటుంబానికి సానుభూతి చూపుతానని అన్నారు.
What is happening to him at this age is unfortunate. I understand the trauma of the family. My sympathies are with the family. https://t.co/EOitvVyHcw
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2023
రాజకీయాల్లో తాను పావుగా మారడం కంటే రాణిగా ఉండటానికే ఇష్టపడతానని...తనపై ఇతరులు చేస్తున్న కామెంట్లను ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
It’s youth who always are the epicentre of change … come join politics … stay put !! Politics cannot be a part time job !! https://t.co/H2gRR1qdPE
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2023
యువత రాజకీయాల్లోకి రావాలని.. రాజకీయం పార్ట్ టైం జాబ్ కాదని కవిత ఓ నెటిజన్ సందేశం ఇవ్వాలని అడిగితే సమాధానం ఇచ్చారు.