Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు వర్షాలు: ఐఎండి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఛత్తీస్‌గఢ్ ఒడిశా వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో వాతావరణ స్థితి
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. నేడు (మార్చి 17న) నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.
రేపు కూడా వర్షాలు
రేపు (మార్చి 18న)ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలో వర్షాలు ఇలా
పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.
ఢిల్లీలోని భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఉత్తర భారతదేశంలోని వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది సమయానికి ముందే ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతల బలమైన ప్రభావం కనిపించింది. తాజాగా పాకిస్తాన్‌లో ఏర్పడిన తుపాను ప్రసరణ కారణంగా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మార్చి నెలలోనే వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు వర్షాలు: ఐఎండి
ఐఎండి అంచనాల ప్రకారం తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మరియు విదర్భ మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఎల్లుండి రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నమోదైన వర్షపాతం వివరాలు :
శుక్రవారం ఉదయం 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో 73.5 మిమీ, బాపట్ల జిల్లా రేపల్లెలో 48.75 మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 47.25మిమీ, చిత్తూరు జిల్లా నగరిలో 44.5 మిమీ, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూర్ లో 41.5 మిమీ, గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 26.25 మిమీ, ప్రకాశం జిల్లా కనిగిరిలో 26.5 మిమీ, వైఎస్సార్ జిల్లా చాపాడులో 24.75 మిమీ వంతున జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.
అమలాపురం పట్టణ సిఐ కొట్టరంటూ టీడీపీ నిరసన
బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా..
అమలాపురం పట్టణ సిఐ కొట్టరంటూ టీడీపీ నిరసన...
టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న సిఐ దుర్గాశేఖర్ రెడ్డి...
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలలో సిఐ అతి ప్రదర్శించారని టీడీపీ నాయకుల నిరసన...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రెండు చోట్లా గెలవడంపై అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కల్చడంతో టీడీపీ కార్యకర్తపై చెంపదెబ్బ కొట్టిన సీఐ దుర్గా శేఖర్ రెడ్డి...
పట్టణ సీఐపై ఆగ్రహించిన టీడీపీ నాయకులు...
అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కాల్చుతుండగా వచ్చి అడ్డుకున్న పోలీసులు..
ఈ క్రమంలోని టిడిపి కార్యకర్త ఫై చేయి చేసుకున్న పట్టణ సీఐ..
అమలాపురం పట్టణ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ రోడ్డుపై బేఠాయించిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP అభ్యర్థి విజయం
విశాఖ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP గెలుపు...ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు లో 94,510 మ్యాజిక్ ఫిగర్ సాధించిన తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు.
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురి దుర్మరణం
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. బత్తలపల్లి మండలం పొట్లమర్రి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి రీత్యా కన్స్ట్రక్షన్ సంస్థపై ఐటీ సోదాలు
తిరుపతిలో రీత్యా కన్స్ట్రక్షన్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని రీత్యా సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. రీత్యా కన్స్ట్రక్షన్స్ యజమాని బాలచందర్ ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి సమీపంలోని తాటితోపు వద్ద నిర్మిస్తున్న భారీ అపార్ట్మెంట్ తో పాటుగా, మరికొన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బాలచందర్ ఇళ్ళు, బంధువుల ఇళ్ళళ్లో సైతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.