అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన  కాలనీలు : సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన  కాలనీలు : సీఎం కేసీఆర్

Background

వారం రోజులు కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఏపీ, తెలంగాణలో రాజమండ్రి, ధవళేశ్వరం, భద్రాచలం వద్ద గోదావరి గరిష్ట నీటి మట్టాన్ని తాకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లోని అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అనుబంధ ఉపరితల ఆవర్తనంగా మారింది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు బలమైన అల్పపీడన ప్రాంతం కేంద్రం గుండా వెళుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా, సౌరాష్ట్ర , కచ్, ఉదయపూర్, రైసెస్ తీర ప్రాంతాలు, జబల్ పూర్, పెంద్రా రోడ్, హీరాకుడ్, కోస్తా ఒడిశా మీదుగా అల్పపీడన కేంద్రం, తీర ప్రాంత ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో.. అక్కడి నుంచి ఆగ్రేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర భారత ద్వీపకల్పమైన 19 డిగ్రీ ఉత్తర అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 7.6 కి.మీ మధ్య సుమారు 18 డిగ్రీల తూర్పు పశ్చిమ షియర్ జోన్ తక్కువగా గుర్తించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయి. వరద నీటితో గోదావరి ప్రాంతాలు చాలా వరకు నీట మునిగాయి. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం తక్కువగానే ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి.  సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి  వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వర్షాలు, వరద ప్రవాహం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగుల దిగువకు  చేరుకుందని వాతావరణ శాఖ తెలిపింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 

12:27 PM (IST)  •  17 Jul 2022

KCR in Flood Affected Areas: ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన  కాలనీలు : సీఎం కేసీఆర్

భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన  కాలనీలు : సీఎం కేసీఆర్

శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం : 
 తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.  భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు.   

12:17 PM (IST)  •  17 Jul 2022

Konaseema Floods: కోనసీమలో వరదలు బీభత్సం

కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ప్రధాన రహదాలు మునక, రాకపోకలకు అంతరాయం

కోనసీమలో లంకలను దాటి ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు

పి.గన్నవరంలోని నాగుల్లంక వద్ద రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

10 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు

పి.గన్నవరం నుండి రాజోలు వెళ్ళే ప్రధాన రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు

పి.గన్నవరం నుండి రాజోలు, రావులపాలెం వెళ్ళే రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..

11:14 AM (IST)  •  17 Jul 2022

KCR in Flood Affected Areas: భద్రాచలం చేరుకున్న కేసీఆర్, గోదారమ్మకు హారతి ఇచ్చిన సీఎం

ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరిన సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. అక్కడ వరద ప్రవాహం తగ్గాలని, శాంతించవమ్మా అంటూ గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గోదావరి బ్రిడ్జిని సైతం కేసీఆర్ పరిశీలించారు.

10:50 AM (IST)  •  17 Jul 2022

Secunderabad Bonalu 2022: తెలంగాణ ఏర్పాటైన తరువాతే బోనాలు ఘనంగా జరుపుకుంటున్నాం: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ ఏర్పాటైన తరువాతే బోనాల పండుగ ఘనంగా జరువుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఉజ్జయినీ అమ్మవారి బోనాలను మంత్రి తలసాని చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఆలయంతోపాటు ఆలయ పరిసరాలను కూడా చాలా అందంగా తీర్చిదిద్దారని.. ఆలయాలు, మసీదులు, చర్చీలను సైతం సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారని చెప్పారు. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. 

10:47 AM (IST)  •  17 Jul 2022

Secunderabad Bonalu 2022: మహాంకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున 4.00 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం అమ్మవారికి మంత్రి తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పణతో జాతర ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు మహాంకాళి అమ్మవారి ఆలయంలో బారులు తీరారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
PAN Card: పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద కొత్త పాన్‌ తీసుకోవాలా? - టాక్స్‌పేయర్లలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇవిగో
పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద కొత్త పాన్‌ తీసుకోవాలా? - టాక్స్‌పేయర్లలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇవిగో
Embed widget