By: Arun Kumar Veera | Updated at : 27 Nov 2024 10:25 AM (IST)
నేను పాన్ 2.0 కింద నా పాన్ కార్డ్‌ను మార్చుకోవాలా? ( Image Source : Other )
PAN Card With QR Code: రాబోయే రోజుల్లో పన్ను చెల్లింపుదారులకు QR కోడ్‌తో కూడిన పాన్ కార్డ్ జారీ అవుతాయి. సోమవారం (25 నవంబర్ 2024) నాడు, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. అయితే కొత్త పాన్‌కు (Permanent Account Number) సంబంధించి పన్ను చెల్లింపుదారుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవాళ్లు కొత్త పాన్ కార్డు తీసుకోవాలా? కొత్త పాన్ వల్ల వచ్చే మార్పులు ఏంటి? వంటి 11 ప్రశ్నలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది.
ప్రశ్న 1 - పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటే ఏంటి?
సమాధానం - ఇది, పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియలో కొత్త మార్పును తీసుకురావడానికి ఆదాయ పన్ను విభాగం చేపట్టిన ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్. సాంకేతికతను ఉపయోగించుకుని పాన్ సేవల్లో నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదాయ పన్ను విభాగం పాన్ కేటాయింపు, నవీకరణ, దిద్దుబాటు ప్రక్రియలను ఏకీకృతం చేస్తుంది. TAN సేవలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో విలీనం అవుతాయి. ఆన్‌లైన్ పాన్ వ్యాలిడేషన్ సర్వీస్ ద్వారా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు పాన్ అథెంటికేషన్ వ్యాలిడేషన్ సౌకర్యం లభిస్తుంది.
ప్రశ్న 2 - ఇప్పటికే ఉన్న సెటప్‌కు PAN 2.0 భిన్నంగా ఉంటుందా?
సమాధానం - ప్రస్తుతం, PAN సంబంధిత సేవలు మూడు వేర్వేరు పోర్టల్‌లలో (ఇ-ఫైలింగ్ పోర్టల్, UTITSL పోర్టల్, ప్రొటీన్ ఇ-గవర్నమెంట్ పోర్టల్); PAN/TAN సేవలు ఆదాయ పన్ను విభాగం ఏకీకృత ప్లాట్‌ఫామ్‌లో లభిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకే పోర్టల్‌లో ఏకీకృతం అవుతాయి. PAN, TAN కేటాయింపు, నవీకరణ, దిద్దుబాటు, ఆన్‌లైన్ పాన్ ధృవీకరణ, అసెస్‌మెంట్ అధికారిని తెలుసుకోవడం, ఆధార్-పాన్ లింక్ చేయడం, పాన్‌ను ధృవీకరించడం, ఇ-పాన్ కోసం అభ్యర్థన, పాన్ కార్డ్ రీప్రింట్ వంటి సేవలు కొత్త పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం కాగిత రహితంగా మారుతుంది.
పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం: పాన్ కేటాయింపు, నవీకరణ, దిద్దుబాటు పూర్తిగా ఉచితంగా మారతాయి. E-PAN మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ అడ్రస్‌కు వస్తుంది. భౌతిక పాన్ కార్డ్ కోసం రూ.50 (భారత్‌లో) చెల్లించాలి. భారతదేశం వెలుపల కార్డు డెలివరీ కోసం రూ.15 + ఇండియా పోస్ట్ ఛార్జీలు చెల్లించాలి.
ప్రశ్న 3 - ఇప్పటికే పాన్ ఉన్న వ్యక్తులు కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలా? పాన్ నంబర్ మార్చుకోవాలా?
సమాధానం - ఇప్పటికే పాన్ ఉన్న వ్యక్తులు పాన్ 2.0 ప్రాజెక్ట్ కింద కొత్త పాన్ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. పాన్ నంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు.
ప్రశ్న 4 - పాన్‌లో పేరు, స్పెల్లింగ్, చిరునామాలో మార్పు వంటి దిద్దుబాట్లు చేయడం సాధ్యమేనా?
సమాధానం - పాన్ హోల్డర్లు తమ ప్రస్తుత పాన్‌లో ఇ-మెయిల్, మొబైల్ నంబర్, చిరునామా, పేరు, పుట్టిన తేదీలో మార్పులు ఉంటే కరెక్షన్/అప్‌డేట్ చేయవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 ప్రాజెక్ట్ అమలులోకి వచ్చే వరకు, ఆన్‌లైన్‌లో ఆధార్ ఆధారితంగా ఇ-మెయిల్, మొబైల్, చిరునామాలో మార్పులు చేసుకోవచ్చు. ఈ క్రింది URLs ఈ సేవలు ఉచితంగా లభిస్తాయి.
https://www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html
https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange
PAN వివరాలలో ఇతర నవీకరణ లేదా దిద్దుబాటు ఉంటే, కార్డుహోల్డర్‌లు భౌతిక కేంద్రాలను సందర్శించడం ద్వారా లేదా డబ్బు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ద్వారా మార్పులు చేయవచ్చు.
ప్రశ్న 5 - నేను పాన్ 2.0 కింద నా పాన్ కార్డ్‌ను మార్చుకోవాలా?
సమాధానం - లేదు. పాన్ హోల్డర్ ఏదైనా అప్‌డేట్ లేదా దిద్దుబాటు కోరుకుంటే తప్ప పాన్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న చెల్లుబాటు అయ్యే PAN కార్డ్‌లు PAN 2.0 ప్రాజెక్టు ప్రకారం చెల్లుబాటు అవుతాయి.
ప్రశ్న 6 - చాలా మంది తమ చిరునామాను మార్చుకోలేదు, పాత చిరునామా అలాగే ఉంది. కొత్త పాన్ కార్డ్ ఎలా అందుతుంది? కొత్త పాన్ కార్డ్ ఎప్పుడు డెలివరీ అవుతుంది?
సమాధానం - పాన్ హోల్డర్లు తమ ప్రస్తుత పాన్‌లో ఏదైనా అప్‌డేట్/కరెక్షన్ కోసం అభ్యర్థిస్తే తప్ప కొత్త పాన్ కార్డ్ డెలివరీ ఉండదు. తమ పాత చిరునామాను అప్‌డేట్ చేయాలనుకునే పాన్ హోల్డర్‌లు ఈ క్రింది URLs ద్వారా ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ సౌకర్యాన్ని ఉపయోగించి ఉచితంగా చేయవచ్చు. కొత్త చిరునామా PAN డేటాబేస్‌లో అప్‌డేట్ అవుతుంది.
https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange
https://www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html
ప్రశ్న 7 - కొత్త పాన్ కార్డ్‌లు QR కోడ్‌తో వస్తుంటే, పాతవి కూడా అలాగే పనిచేస్తాయా? QR కోడ్ వల్ల ఉపయోగమేంటి?
సమాధానం - QR కోడ్ కొత్త ఫీచర్ కాదు, ఇది 2017-18 నుంచి PAN కార్డ్‌లకు అమలవుతోంది. PAN 2.0 ప్రాజెక్ట్‌లో, ఈ QR కోడ్ పాన్ డేటాబేస్‌లో తాజా డేటాను చూపుతుంది. QR కోడ్ లేని పాత పాన్ కార్డ్ హోల్డర్‌లు ప్రస్తుత పాన్ 1.0 ఎకో-సిస్టమ్‌లో, అలాగే పాన్ 2.0లోను QR కోడ్‌తో కూడిన కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. QR కోడ్ PAN వివరాలను ధృవీకరించడంలో సాయపడుతుంది. QR కోడ్ వివరాల ధృవీకరణ కోసం నిర్దిష్ట QR రీడర్ అప్లికేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. QR కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు కార్డ్ హోల్డర్ పూర్తి వివరాలు అంటే ఫోటో, సంతకం, పేరు, తండ్రి పేరు/తల్లి పేరు, పుట్టిన తేదీ స్కీన్ మీద కనిపిస్తాయి.
ప్రశ్న 8 - వ్యాపార సంబంధిత కార్యకలాపాల్లో 'కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్' అంటే ఏమిటి?
సమాధానం - కేంద్ర బడ్జెట్ 2023లో, పాన్ అవసరమయ్యే వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ ఏజెన్సీల అన్ని డిజిటల్ వ్యవస్థలకు పాన్‌ను 'కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్'గా ఉపయోగిస్తామని ప్రకటించారు.
ప్రశ్న 9 - 'కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్' ప్రస్తుతం ఉన్న పాన్ వంటి ప్రత్యేక పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్యను మారుస్తుందా?
సమాధానం - లేదు.
ప్రశ్న 10 - యూనిఫైడ్ పోర్టల్ అంటే ఏమిటి?
సమాధానం - ప్రస్తుతం, PAN సంబంధిత సేవలు మూడు వేర్వేరు పోర్టల్‌లలో అందుతున్నాయి. PAN 2.0 ప్రాజెక్ట్ కింద, అన్ని PAN/TAN సంబంధిత సేవలు ఆదాయ పన్ను విభాగం ఏకీకృత పోర్టల్‌లోకి వస్తాయి. కేటాయింపు, నవీకరణ, దిద్దుబాటు, ఆన్‌లైన్ పాన్ ధృవీకరణ (OPV), మీ AO గురించి తెలుసుకోండి, ఆధార్-పాన్ అనుసంధానం, పాన్‌ను ధృవీకరించడం, ఇ-అభ్యర్థన వంటి PAN & TANకి సంబంధించిన అన్ని ఎండ్-టు-ఎండ్ సేవలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. PAN కార్డ్ రీప్రింట్ అభ్యర్థనతో సహా అన్ని పనులు మరింత సులభంగా మారతాయి. PAN సేవల్లో జాప్యం, వివిధ రకాల అప్లికేషన్‌లను స్వీకరించడం (ఆన్‌లైన్ eKYC/ఆన్‌లైన్ పేపర్ మోడ్/ఆఫ్‌లైన్) కారణంగా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరగదు.
ప్రశ్న 11 - ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ ఉంటే అలాంటి వారిని ఎలా గుర్తిస్తారు? అదనపు పాన్ ఎలా తీసేస్తారు?
సమాధానం - ఆదాయ పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం, ఏ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను కలిగి ఉన్నట్లయితే, అతను దానిని తన ప్రాంతంలోని అసెస్సింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి అదనపు పాన్‌ను రద్దు చేయాలి లేదా నిష్క్రియం చేయాలి. PAN 2.0లో, PAN కోసం వచ్చే నకిలీ అభ్యర్థనలను గుర్తించడానికి మెరుగైన వ్యవస్థలు ఉన్నాయి. నకిలీలను గుర్తించే కేంద్రీకృత వ్యవస్థలు ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ PANలను కలిగి ఉండే అవకాశాన్ని తగ్గిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?
Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!
ITR Filing: పన్ను చెల్లింపుదార్లకు గుడ్ న్యూస్ - ITR ఫైలింగ్ గడువు పెంచిన టాక్స్ డిపార్ట్మెంట్
Gold-Silver Prices Today 31 Dec: నగలు కొనేవాళ్లకు న్యూ ఇయర్ గిఫ్ట్, భారీగా తగ్గిన బంగారం రేటు - ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవి
New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
Cheapest Insurance Policy: ఇది దేశంలోనే అత్యంత చవకైన బీమా పాలసీ, కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజ్
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం