Andhra News: టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్తను అరెస్ట్ చేసిన సీఐడీ - నోటీసులిచ్చి విడుదల, టీడీపీ నేతల ఆగ్రహం
TDP NRI Yash: టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరు యశస్వి (యష్)ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు.
AP Cid Arrested TDP NRI Activist in Shamshabad Airport: టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త (TDP NRI Activist) బొద్దులూరి యశస్వి(యష్)ని (Bodduluri Yasaswi) ఏపీ సీఐడీ పోలీసులు (AP CID Police) శనివారం అరెస్ట్ చేశారు. వృత్తి రీత్యా అమెరికాలో ఉంటున్న యశస్వి, అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు రాగా, శంషాబాద్ విమానాశ్రయంలోనే (Shamshabad Airport) చుట్టుముట్టారు. తమ వెంట రావాలని చెప్పగా, తన తల్లికి బాగాలేకపోతే చూసేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. ఆయన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు (Guntur) సీఐడీ కార్యాలయానికి తరలించారు. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM Jagan) కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విడుదల చేశారు. 2024, జనవరి 11న తిరుపతి (Tirupati) సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు. కాగా, సీఐడీ పోలీసుల తీరును టీడీపీ నేతలు ఖండించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. యష్ పట్ల సీఐడీ తీరు దుర్మార్గమని, అక్రమ అరెస్టులతో ప్రభుత్వం తన వక్ర బుద్ధిని బయటపెడుతోందని విమర్శించారు. యష్ అక్రమ అరెస్టును అమెరికాలోని ఎన్నారైలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారని చెప్పారు. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన అరెస్ట్ నిరసిస్తూ ప్రధాన నగరాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.
నాారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్త యశస్విని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదిని హింసించినట్లు యశస్వితో సీఐడీ వ్యవహరించిందని, ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు. 'ప్రశ్నించే గొంతుకలను నిర్బంధాల ద్వారా వైసీపీ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోంది. న్యాయం జరిగే వరకూ విశ్రమించబోం. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయి.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యష్ అరెస్టుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Shocked to learn about the illegal arrest of NRI Yash Bodduluri at Hyderabad airport yesterday night on the basis of false cases filed against him in Andhra Pradesh. This draconian govt wants to stifle voices that question with arrests and detentions. I have learned that he was… pic.twitter.com/zrFCGlvM06
— Lokesh Nara (@naralokesh) December 23, 2023
సీఎం జగన్ సైకోయిజానికి యష్ అరెస్ట్ నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులు, అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.? అని నిలదీశారు. వైసీపీ నియంతృత్వ పోకడలకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.