By: ABP Desam | Updated at : 23 Feb 2023 04:28 PM (IST)
హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి
KTR : హైదరాబాద్‌లో మరో ప్రసిద్ధ కంపెనీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. బీఎంఎస్... (Bristol Myers Squibb) కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూ ద్వారా 1,500 మందిని నియమించుకుంటామన్న బీఎంఎస్ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మం తమకు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం సందర్భంగా హైదరాబాద్ ఫార్మాసిటీలో ఉన్న అవకాశాల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు.హైదరాబాద్ నగరం బయోటెక్నాలజీ , ఐటీ కి గొప్ప ఆకర్షణీయ గమ్య స్థానంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
#HappeningHyderabad
Global Pharmaceutical giant Bristol Myers Squibb to set up a state-of-the-art facility in Hyderabad with an investment of USD 100 Million. The proposed facility in Telangana will employ about 1,500 local youth. pic.twitter.com/Gc5PhF5yT6— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 23, 2023
ప్రపంచంలోనే టాప్ టెన్ ఫార్మాసుటికల్ కంపెనీల్లో బీఎంఎస్ ఒకటి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు. . బీఎంఎస్ కూడా ఈ రెండు రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్ నగరంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యం వారి కార్యకలాపాలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నానన్నారు. 2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ రోజు బీఎంఎస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. లైఫ్ సైన్సెస్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని బీఎంఎస్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐదేండ్ల కిందట తాము హైదరాబాద్ వచ్చినప్పుడు పరిస్థితి గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మౌలిక వసతుల విషయంలో నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. రానున్న మూడు సంవత్సరాల్లో తమ కంపెనీ సుమారు 1500 మంది ఉద్యోగులను నియమించుకుంటుందని.. 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తమ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతోందని వారు స్పష్టం చేశారు.
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?