Breaking News Live: అనాతవరం జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొట్టిన బస్సు... ఇద్దరు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
అనాతవరం జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొట్టిన బస్సు... ఇద్దరు మృతి

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం సమీపంలో 216 జాతీయ రహదారిపై బైక్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగంగా వచ్చి బైకును ఢీ కొనడంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో టి.కొత్తపల్లికి చెందిన దొరబాబు(వాలంటీర్), ముమ్మిడివరానికి చెందిన అబ్బాదాసుల దుర్గబాబు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

పరకాలలో మంత్రుల పర్యటన

* పరకాల నియోజకవర్గం పరకాల, నడికూడ మండలాల్లోని నాగారం, మల్లక్కపేట, నడికూడ గ్రామాలలో పర్యటించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల బృందం.

* వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చిన మంత్రులు

* మంత్రులను చూడగానే కన్నీరుమున్నీరుగా విలపించిన బాధిత రైతులు.. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ

* మంత్రులతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసిన రైతు సమన్వయ బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి

చంద్రబాబు త్వరగా కోలుకోవాలని కోరిన సీఎం జగన్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరోనా బారిన పడడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అంతా వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కరోనా

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కరోనా బారిన పడ్డారు. టెస్టులు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోల మృతి

* ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్

* పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

* పోలీసుల కాల్పులలో ఇద్దరు మావోయిస్టులు హతం

* మృతుల సంఖ్య పెరిగే అవకాశం

* తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని వెంకటాపురం మండలం కర్రెగుట్టల సమీపంలో ఘటన

*  తెలంగాణ సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు సమాచారం

కిటకిటలాడుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగామారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో  కొద్ది వారాలుగా భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు.  సోమవారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మందికి పైగా భక్తులు  తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. 

Background

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలగానే వెంటనే ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా మెలిగిన వారు, నేరుగా కాంటాక్ట్ ఉన్నవారు కూడా జాగ్రత్త వహించాలని చంద్రబాబు సూచించారు. వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్‌లోకి వెళ్లాలని చెప్పారు. అందరూ సేఫ్‌గా, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు కోరారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోమవారం (జనవరి 17) సోషల్ మీడియాలో లోకేష్ ప్రకటించారు. తనకు లక్షణాలేమీ లేవని... ఎలాంటి అనారోగ్యం లేదని హోంఐసోలేషన్‌లో ఉన్నానని లోకేష్ ప్రకటించారు. తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Also Read: TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం
కరీంనగర్ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 1,143 టెస్టులు చెయ్యగా 310 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గోదావరిఖనిలోని ఆస్పత్రి కేంద్రంలో 173 మందికి పరీక్షలు చేయగా అందులో 48 మందికి.. అలాగే రాపిడ్ టెస్ట్ కేంద్రంలో 150 మందికి పరీక్షలు చేయగా 65 మందికి.. అడ్డగుంట పల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 71 మందికి గాను 29 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక సింగరేణి ఆర్.జి 1, 2 ఆస్పత్రుల్లో 242 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో దాదాపు సగం అంటే 119 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

గుడివాడ కేసినోపై ఫిర్యాదు
సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలోని కె-కన్వెన్షన్ హాల్‌లో కేసినో నిర్వహించారు. దీనికి మంత్రి కొడాలి నాని కర్త, కర్మ, క్రియ అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా కె-కన్వెన్షన్ సెంటర్లో కేసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. జూదం, అసభ్య నృత్యాల నిర్వహణ ద్వారా రూ.500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో ఆరోపించారు.

Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..

Also Read: Formula E Hyderabad : లండన్, న్యూయార్క్ అండ్ హైదరాబాద్.. "ఫార్ములా ఈ" కార్ రేసులకు వేదికగా భాగ్యనగరం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి