Breaking Updates Live: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం : చంద్రబాబు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 19న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 19న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం : చంద్రబాబు
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ దాడులకు పాల్పడడని, దాడులను తిప్పి కొడతామన్నారు. ప్రభుత్వం, పోలీసులు కలిసే టీడీపీ కార్యలయాలపై దాడులకు పాల్పడిందన్నారు. తాను ఫోన్ చేసినా డీజీపీ స్పందించలేదని చంద్రబాబు అన్నారు.
రేపు ఏపీలో బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ
రాష్ట్రంలో సెక్షన్ 356 అమలు అయ్యే పరిస్థితులు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలో రేపు టీడీపీ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్పాన్సర్డ్ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడులు జరుగుతుంటే డీజీపీ చేతులు కట్టుకుని ఉన్నారని ఆరోపించారు.
సీఎం, డీజీపీలకు తెలిసే టీడీపీ ఆఫీసులపై దాడులు : చంద్రబాబు
టీడీపీ కార్యాలయాలపై దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పోలీసులు, సీఎం ప్లాన్ చేసి దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దాడుల విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు.
యాదాద్రి పునః ప్రారంభం ముహూర్తం ఖరారు... తేదీ ప్రకటించిన సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రికి చేరుకుని ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మార్చి 28, 2022 మహా కుంభ సంప్రోక్షణ, 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆరు వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామన్నారు. 1008 కుండలాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామన్నారు.
హిందూపురంలో బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన వైసీపీ శ్రేణులు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎమ్మెల్యే నివాసం ముట్టడికి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.