Weather Updates: ఏపీలో భారీగా పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. తెలంగాణను కమ్మేసిన మేఘాలు
ఉత్తరం వైపు నుంచి వీచే గాలులు ఆగిపోవడంతో చలి తగ్గి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Weather Updates: ఉత్తర భారతదేశంలో జనవరి 6 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, నార్త్ రాజస్థాన్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ మద్యప్రదేశ్‌లలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఏపీ, తెలంగాణలో కొన్ని రోజుల కిందట తేలికపాటి జల్లులు కురిశాయి. ముఖ్యంగా ఉత్తరం వైపు నుంచి వీచే గాలులు ఆగిపోవడంతో చలి తగ్గి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఏపీలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని, వాతావరణం అనుకూలిస్తుందని తెలిపారు. రెండు వైపుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉండనుంది. ఈ ప్రాంతాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.
View this post on Instagram
దక్షిణ కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఏపీలోని రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక్కడ సైతం ఎలాంటి వర్ష సూచన లేదు. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మరో మూడు రోజుల వరకు ఏపీలో ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం లేదని.. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కొవిడ్19 నిబంధనలు కఠినంగా పాఠించాలని అధికారులు సూచించారు.
View this post on Instagram
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
ఈశాన్య, తూర్పు దిశ గాలులు ఏపీ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం గత కొన్ని రోజులుగా పొడిగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి ప్రభావం రోజురోజుకూ తగ్గుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జనవరి 7 వరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 8 నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తూ.. ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Also Read: JP Nadda In Hyderabad: బీజేపీ ధర్మయుద్ధం చేస్తోంది... తెలంగాణలో నియంతృత్వ పాలన... కేసీఆర్ పై జేపీ నడ్డా ఫైర్
Also Read: AP Omicron Cases: ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు... 24కు చేరిన మొత్తం కేసులు