అన్వేషించండి

BSP seat to Transgender: బీఎస్పీ రెండో జాబితా విడుదల- ట్రాన్స్ జెండర్ కు సీటు కేటాయింపు

BSP Second List Telangana Elections 2023: బీఎస్పీ తన రెండో జాబితాను విడుదల చేసింది. 20 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. ఇప్పుడు 43 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది.

Telangana Elections 2023 BSP Second List: 

తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. కాంగ్రెస్ రెండు జాబితాల్లో 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీజేపీ కూడా రెండో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బీఎస్పీ తన రెండో జాబితాను విడుదల చేసింది. 20 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. ఇప్పుడు 43 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. కాగా.. ఈ లిస్టులో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి స్థానానికి కూడా బీఎస్పీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ లిస్టులో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి  ఉడతావర్‌ సురేష్‌ గౌడ్‌ ను ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను బహుజన్ సమాజ్ పార్టీ (BSP) విడుదల చేసింది. 43 మందిలో 26 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు సీట్లు కేటాయించినట్లు బిఎస్పీ వెల్లడించింది. ఇందులో వరంగల్ తూర్పు టికెట్ ను ట్రాన్స్ జెండర్ కు కేటాయించినట్లు ఆ పార్టీ తెలిపింది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీఎస్పీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. 

రెండో జాబితాలో కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ ఈస్ట్ స్థానంలో పుష్పిత లయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బీఎస్పీ బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా పుష్పిత లయ రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. 

రెండో జాబితా అభ్యర్థులు వీరే....

1.బెల్లంపల్లి(ఎస్సీ) - జాడీ నర్సయ్య

2.ఆసిఫాబాద్ (ఎస్టీ) - కనక ప్రభాకర్

3.మంచిర్యాల - తోట శ్రీనివాస్

4.బోథ్ (ఎస్టీ) - మెస్రాం జంగుబాపు

5.కోరుట్ల - నిశాంత్ కార్తీకేయ గౌడ్

6.కామారెడ్డి - ఉడతావర్ సురేష్ గౌడ్

7.సిరిసిల్ల - పిట్టల భూమేష్ ముదిరాజ్

8.వేములవాడ - గోలి మోహన్

9.జగిత్యాల - బల్కం మల్లేష్ యాదవ్

10.రామగుండం - అంబటి నరేష్ యాదవ్

11.హుజూరాబాద్ - పల్లె ప్రశాంత్ గౌడ్

12.దుబ్బాక - సల్కం మల్లేష్ యాదవ్

13.మహుబూబ్‌నగర్ - బోయ స్వప్న శ్రీనివాసులు

14.కొడంగల్ - కురువ నర్మద కిష్టప్ప

15.దేవరకద్ర - బసిరెడ్డి సంతోష్ రెడ్డి

16.అచ్చంపేట (ఎస్సీ) - మెత్కూరి నాగార్జున

17.మక్తల్ - వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

18.కల్వకుర్తి - కొమ్ము శ్రీనివాస్ యాదవ్

19.కొల్లాపూర్ - గగనం శేఖరయ్య

20.షాద్ నగర్ - పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

21.హుజూర్‌నగర్ - రాపోలు నవీన్

22.మునుగోడు - అందోజు శంకరాచారి

23.వరంగల్ ఈస్ట్ - చిత్రపు పుష్పతలయ

24.మహబూబాబాద్ - గుగులోత్ శంకర్ నాయక్

25.పాలకుర్తి - సింగారం రవీంద్రగుప్త

26.స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) - తాళ్లపల్లి వెంకటస్వామి

27.నర్సంపేట - డా.గుండాల మధన్ కుమార్

28.వర్దన్నపేట (ఎస్సీ) - డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

29.డోర్నకల్ (ఎస్టీ) - గుగూలోత్ పార్వతీనాయక్

30.ములుగు (ఎస్టీ) - భూక్యా జంపన్న నాయక్

31.భద్రాచలం (ఎస్టీ) - ఇర్పా రవి

32.పినపాక (ఎస్టీ) - వజ్జ శ్యామ్

33.అశ్వారావుపేట్ (ఎస్టీ) - మడకం ప్రసాద్

34.మధిర (ఎస్సీ) - చెరుకుపల్లి శారద

35.చేవేళ్ల (ఎస్సీ) - తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ

36.పరిగి - యంకెపల్లి ఆనంద్

37.రాజేందర్ నగర్ - ప్రొ. అన్వర్ ఖాన్

38.ఉప్పల్ - సుంకర నరేష్

39.మలక్ పేట్ - అల్లగోల రమేష్

40.చంద్రాయణగుట్ట - మూల రామ్ చరణ్ దాస్

41.నాంపల్లి - మౌలానా షఫీ మసూదీ

42.ఇబ్రహీంపట్నం - మల్లేష్ యాదవ్

43.శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget