Warangal Hospital : రూ.1100 కోట్లతో వరంగల్ సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి... నిధులకు పాలనా అనుమతులు జారీ !
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి రూ. 1100కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్. ఎ. ఎం. రిజ్వీ, జీ ఓ 158 ని జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్ కి రూ. 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ. 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ. 182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ. 105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ. 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ. 229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని జీవోలో ఆదేశాలుఇచ్చారు.
Also Read : తక్కువ కులం వ్యక్తితో ప్రేమ... కన్న కూతుర్నే హత్య చేసిన అమ్మ, అమ్మమ్మ...
వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో సీఎం కెసిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు కూడా మంజూరు చేశారు. అలాగే, ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ రెండూ ఒకే మంత్రి వద్ద ఉండటం వల్ల పనులు మరింత వేగం కాగలవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి అయితే, హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం, ఇక్కడే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : చివరి ఆప్షన్‌గా కోర్టులు ఉండాలన్న సీజేఐ
వైద్యం కోసం వరంగల్ జిల్లా నుంచి ప్రతి రోజూ వందల మంది హైదరాబాద్ వస్తూంటాని.. ఇప్పుడు వరంగల‌్‌లోనే ఆస్పత్రి పూర్తయితే హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై భారం తగ్గుతుందని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. సీఎం కెసిఆర్ అధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కేసిఆర్ ది అని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ అభివృద్ధి పై కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు.
ఆస్పత్రికి సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారయ్యాయి. సెంట్రల్ జైలును కూలగొట్టి ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా చదును కూడా చేశారు. ఇక పనులు ప్రారంభించడమే మిగిలి ఉంది.
Also Read: Rosaiah Rare Photos: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రేర్ ఫొటోస్.. ప్రముఖులతో జ్ఞాపకాలు ఇవిగో..