News
News
X

Adilabad News: ఆదిలాబాద్‌లో ఓవైపు చలి, మరోవైపు పులి! హడలెత్తిపోతున్న జనం, భయం గుప్పిట్లో రైతులు!

Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా పెద్దపులులు కనిపిస్తుండటంతో అన్నదాతలు హడలిపోతున్నారు. ఏ పనులు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

FOLLOW US: 

Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజూ  ఏదో ఓ చోట ఎదో ఒక గ్రామంలో పెద్ద పులులు సంచరిస్తూన్నాయి. ఇది వరకు పశువులపై దాడి చేసిన పులి ఇప్పుడు మనుషులపై దాడి చేస్తోంది. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అనే రైతు పై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన అనంతరం అతడిని కిలో మీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్ళింది. గమనించిన స్థానిక రైతులు కేకలు వేయడంతో పులి అక్కడ నుండి అటవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది. స్థానికుల ద్వారా అటు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని రైతు భీము మృతదేహాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీఎఫ్ అధికారి వినోద్ కుమార్, ఆసిఫాబాద్‌ డీఎఫ్ఓ దినేష్, సీసీ కెమెరాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనుమానంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో మొత్తం 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20 పులుల వరకూ సంచారం..

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ శివారులో సిడాం భీము అనే రైతును చంపేసిన పులి మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం పరిధిలోని రాజురా అడవులలో నుంచి వచ్చిందని అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలోనే రాజురా అటవీ ప్రాంతం ఉంటుంది. అటువైపు నుండే పులులు తెలంగాణలోకి వస్తున్నాయి. కుమురం భీం జిల్లాలోని వాంకిడి, ఆసిఫాబాద్, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్(టి), పెంచికల్ పేట్, దహెగాం.. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌, కోటపల్లి, బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్ మండలాల్లో పులులు సంచరిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20 పులులు సంచరిస్తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు పులి దాడిలో ముగ్గురు బలయ్యారు. 2020వ సంవత్సరం నవంబరు 11న పులి దహెగాం మండలంలోని దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ (19) పై దాడి చేసి చంపేసింది. అదేవిధంగా 2020 నవంబరు 29న పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల (16) పై పులి పంజా విసిరి బలి తీసుకుంది. తాజాగా ఇప్పుడు వాంకిడి మండలంలోని ఖానాపూర్ శివారులో లో సిడాం భీము అనే రైతు పై పులి దాడి చేసి హతమార్చింది. ఈ పులిదాడితో జిల్లాలో మృతుల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పులి దాడిలో 165 పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు.

మేకల మందలపై పులి దాడి..

News Reels

మళ్లీ తాజాగా కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ పట్టణంలో పులి సంచరించింది. వంజిరి రైల్వే గేటు, మసీద్ ఎరియా, వాసవి గార్డెన్ ప్రాంతాల్లో పులి అడుగులు గుర్తించారు అటవిశాఖ అధికారులు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు నుండి పెద్దవాగు శివారులో, రాస్పెల్లి శివారులో బెంగాలి క్యాంప్ 4లో పులి సంచరించింది. సిర్పూర్ (టి) మండలంలోని కేశవపట్నం బీట్ పరిదిలోని భూపాలపట్నం శివారులో మేకల మందపై పులి దాడి చేసింది. ఓ గొర్రెపై పులి దాడి చేసి హతమార్చింది. గమనించిన కాపరి గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడ నుండి సమీప అడవుల్లోకి వెళ్లిపోయింది. విషయం అటవీ శాఖ అధికారులకు తెలుపగా పులి అడుగులను గుర్తించారు. పులి జాడలను తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఎర్పాటు చేశారు. సమీప అడవుల్లోకి ప్రజలు వెళ్లొద్దని సూచించారు. రైతులు చేలలోకి వెళ్తే గుంపులు గుంపులుగా వెళ్లాలని, పులి సంచరిస్తూన్న క్రమలంలో అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నాలుగు పులులు రోడ్డు దాటుతూ హల్ చల్..

అదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్ మండలాలలో పులులు సంచరిస్తున్నాయి. పేన్ గంగా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పులి సంచారం ఉంది. పెన్ గంగా నదిని ఆనుకొని పక్కనే మహరాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం ఉంది. ఈ తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి పేన్ గంగానదిని దాటుకొని తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోకి పులులు అడుగు పెడుతున్నాయి. ఇటివలే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చనకా కొరటా ప్రాజెక్టులోని హత్తిఘాట్ కెనాల్ లో రెండు పులులు సమీప రైతులకు కనిపించాయి. అనంతరం భీంపూర్ మండలం తాంసి-కె శివారులోని పిప్పల్ కోటి రిజర్వాయర్ పనుల ప్రదేశంలో రాత్రిపూట నాలుగు పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. క్యాంప్ డ్రైవర్ రాజు సింగ్ పని ప్రదేశం నుంచి వెళ్తుండగా హఠాత్తుగా రోడ్డుపై నాలుగు పులులు కనిపించడంతో వాహనాన్ని నిలిపి, తన సెల్ ఫోన్లో పులుల విడియోను చిత్రీకరించాడు. ఆ విడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో అటవిశాఖ అధికారులు డీఎఫ్ఓ రాజశేఖర్, రెంజ్ అధికారి గులాబ్ సింగ్ సిబ్బందితో కలిసి పులులు సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. డ్రైవర్ ని పిలిచి వివరాలు ఆరా తీశారు. అడుగుల గుర్తులతో పులుల సంచారాన్ని ధ్రువీకరించారు. ఓ పెద్దపులి తన మూడు పిల్లలు ఉన్నట్లు అటవి అధికారులు గుర్తించారు. ఇవి పిప్పల్ కోటి పేన్ గంగానది భీంపూర్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. 

40 సీసీ కెమెరాల ఏర్పాటు..

భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ శివారులో ఓ ఆవుపై పులులు దాడి చేసి హతమార్చాయి. దీంతో అప్రమత్తయిన అటవీ శాఖ అధికారులు 20 మంది సిబ్బందితో బేస్ క్యాంప్ ఎర్పాటు చేశారు. పులి సంచరించే ప్రాంతాల్లో మొత్తం 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సమాచారం వచ్చిన చోటా పులి అడుగులను పరిశీలిస్తు పులి జాడలను తెలుసుకుంటు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులు గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు తెలుసుకుని పరిసర పిప్పల్ కోటి, తాంసి-కె, గొల్లఘాట్, గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పంటచేల వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. పులి భయంతో పత్తి రైతులకు కూలీలు దోరకడం లేదు. స్వయంగా రైతులు, మరియు ధైర్యంగా వచ్చిన ఒకరిద్దరు కూలీలతో కలిసి భయం గుప్పిట్లోనే పత్తి ఎరుతున్నారు. రైతులకు ప్రస్తుతం పత్తి సీజన్ ప్రారంభమైంది. పత్తి పంట చేతికొచ్చింది. చలికి పత్తి పగలడంతో పత్తి ఎరేందుకు కూలీలు చేలలోకి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పులిభయానికి రైతులు ఉదయం 9, 10 గంటలకు చేలలోకి వెళ్లి పనులను ముగించుకొని తిరిగి సాయంత్రం 4, 5 గంటలకే ఇంటిబాట పడుతున్నారు. ఇలా రైతులు కూలీలు సతమవుతున్నారు. 

చేలలో ఉన్న పశువులు పులిని చూసి పారిపోతున్నాయి. గొల్లఘాట్ గ్రామానికి చెందిన దత్తు అనే రైతుకు చెందిన ఎద్దు తన చేనులో పులిని చూసి పారిపోయింది. నాలుగు రోజులు గడిచిన ఎద్దు జాడ కనపడలేదు. అందరు పులి దాడిలో ఎద్దు హతమైందని అనుకున్నారు కానీ వాట్సప్ మాధ్యమాల ద్వారా తన ఎద్దు గోట్ కూరి గ్రామంలో ఉందని సమాచారం రావడంతో రైతు దత్తు ఊపిరి పిల్చుకున్నాడు. తన ఎద్దుని తెచ్చుకున్నాడు. తాజాగా పిప్పల్ కోటి గ్రామానికి చెందిన బాబన్న అనే రైతుకు చెందిన లేగదూడపై పులి దాడి చేసింది. ఉదయం అన్ని పశువులతో కలిసి వెళ్ళిన లేగదూడ గాయాలతో మధ్యాహ్నం పూట ఇంటికి చేరుకొంది. రైతు చూసేసరికి పులి దాడిలో తీవ్ర గాయాల పాలైంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా పశు వైద్యుడిని పిలిచి లేగదూడకు వైద్యమందించారు. లేగదూడ గాయాలను పరిశీలించి స్థానిక రైతులకు పులి సంచారం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. 

అడవులకు ఆలవాలమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులులకు ఇలాఖగా మారుతోంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ అభయారణ్యాల నుంచి పులులు ఆవాసం.. తోడు కోసం వలస వస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల అలజడి నెలకొంది. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు సంతానోత్పత్తి జరిగే సమయం కావడంతో మగ పులులు ఆడ తోడు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు సుదీర్ఘమైన నడక సాగిస్తాయని, ఈ నేపథ్యంలోనే తరచూ రహదారులపై తారస పడుతున్నాయి. 2015 లో కుమురం భీం జిల్లా సిర్పూర్(టి) అడవుల్లో పాల్గుణ పులిని అధికారులు గుర్తించగా, ఇది రెండు ఈతల్లో 8 పులి పిల్లలకు జన్మనిచ్చింది. 

2019లో 16 పులుల జననం..

అనంతరం 2019లో S1 పులి రాగా.. దీని వల్ల 16 పులులు జన్మించాయి. అదే సంవత్సరం నవంబరులో A1, A2 పులి రాగా, అసిఫాబాద్ జిల్లాలో A2 పులి దాడిలో ఇద్దరు చనిపోయారు. గత నెలలో పెంచికల్ పేట్ కు P1 అనే కొత్త పులి రాగా, కాగజ్‌నగర్‌ డివిజన్ లో ఉండే K8 అనే పులికి మూడు పిల్లలు జన్మించాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు సరిహద్దుగా ఉన్న తాడోబా, తిప్పేశ్వర్,  ఇంద్రావతి అభయారణ్యాలలో ఏటా 35 వరకు పులి పిల్లలు జన్మిస్తున్నాయి. అవి కుమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు వస్తున్నాయి. మగ పులి 100 చదరపు కిలో మీటర్ల పరిధిలో, ఆడపులి 10 నుంచి 30 చదరపు కిలో మీటర్ల పరిధిలో తమ సామ్రాజ్యాలను ఏర్పరుచుకుంటాయి. జతకట్టే సమయంలో తప్పితే పులులు తమ సామ్రాజ్యంలో మరో పులిని అనుమతించవు. S3,  S8 పులులు తోడు కోసం గతేడాది కుమురం భీం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మారెడుమిల్లి ఆడవులకు 500 కిలోమీటర్లు పైగా ప్రయాణించి వెళ్లాయి. ప్రత్యేక ట్రాకింగ్ పద్ధతి ద్వారా అటవీ అధికారులు ఈ విషయం నిర్ధారించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు వచ్చే పులులు వెచ్చే 12 మార్గాలను అవరోదాలు లేకుండా చూడడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 

వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి..

పులులు తమ సామ్రాజ్యాన్ని 100 నుంచి 3000 హెక్టార్ల పరిధిలో ఏర్పరుచుకుంటాయి. పేన్ గంగానది పరివాహక ప్రాంతంలో 3000 ఎకరాల వరకు పడావు భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఎత్తైన గడ్డి పులులకు అవాస యోగ్యంగా ఉండటంతో అవి ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఓ పులి దానితో పాటు వాటి మూడు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటు కాగజ్‌నగర్‌ టైగర్ కారిడార్ ప్రస్తుతం 9వేల హెక్టార్లు కాగా పులులకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. గత నెల నుంచి ఈ ప్రాంతంలో పులి ఈతలో మూడు పిల్లలను జన్మినివ్వగా, రెండు కొత్త పులులు వచ్చాయి. ఇవి వేమనపల్లి, కుశ్నపల్లి, నెన్నెల, రున్నపెళ్లి, బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతానికి వెళ్తున్నాయి. ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరుచుకునే అవకాశం లేక ఇంద్రావతికి తరలిపోతున్నాయి. అదిలాబాద్ జిల్లాలో తాంసి-కె, అందూర్పల్లి, గోల్లఘాట్, జైనథ్ ఆటవీ ప్రాంతాలు తిప్పేశ్వర్ అభయారణ్యాలకు సమీపంలోనే ఉంటాయి. ఆవాసం కోసం ఇక్కడికి వచ్చినవి, కవ్వాల్ అభయారణ్యాలకు వెళ్లే దారి లేక, మళ్లీ తిరిగి వెళ్లి పోవడమో. వేటగాళ్ల చేతిలో మృత్యువాతపడడమో జరుగుతోంది. కవ్వాల్ పరిధిలో 2017 సంవత్సరంలో పులి అడుగులు కనిపించాయి. అనంతరం 2020 - 2021 సంవత్సరంలో ఇంద్రవెల్లి మండలం వాల్గొండ శివారులో వేటగాళ్ల ఉచ్చుకు ఓ పులి బలిఅయింది. అప్పటి నుండి మాత్రం ఇప్పటి వరకు పులి గురించి ఎలాంటి జాడలేదు.

గత నెలరోజుల నుంచి ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లో ఎక్కడో ఒకచోట తరచూ పులుల సంచారం.. పశువులపై దాడులు చేసిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో తాడోబా అభయారణ్యం నుంచి వచ్చిన A2 పులి జనావాసాలకు దగ్గరగా వచ్చేది. తరచూ ప్రజలకు కనిపిస్తూ భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరిని చంపేసిన ఈ బెబ్బులి ఒకేరోజు నాలుగైదు పశువులను వేటాడేది. అధికారులు దానిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మత్తుమందు ఇచ్చి ఈ పులిని పట్టుకోవడానికి బెజ్జూరు మండలంలోని దీపురుదేవర అటవీ ప్రాంతంలో జనవరి 2021లో నాలుగు రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేశారు. బోను, ఎరను సైతం అమర్చినా ఆ పులి పట్టుబడ లేదు అనంతరం దీని ఆచూకీ లభించకపోవడంతో అది మహారాష్ట్రకు వెళ్లిపోయిందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌, సిర్పూర్ టి, దెహెగాం, పేన్ గంగానది సరిహద్దులోని తాంసి కే, పిప్పల్ కోటి ప్రాంతాల్లో పులుల సంచారం హడలెత్తిస్తోంది.

Published at : 20 Nov 2022 09:55 AM (IST) Tags: Adilabad News Tiger wandering Telangana News Tiger Latest Update Tiger Wandering in Adilabad

సంబంధిత కథనాలు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Karimnagar Cable Bridge : కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జి!

Karimnagar Cable Bridge : కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జి!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో  56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !