By: ABP Desam | Updated at : 27 Feb 2023 08:20 PM (IST)
నటి కస్తూరి శంకర్ (Photo: Instagram)
Actress Kasthuri Shankar Interesting Comments: నటి కస్తూరి శంకర్ ఓ ఫైర్ బ్రాండ్ అని తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే, సీరియల్స్ లోనూ బిజీగా ఉన్న నటి కస్తూరి తరచూ కీలకమైన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాలిటిక్స్ లో కింగ్ మేకర్ అని, హైదరాబాద్ బ్లూ ప్రింట్ ఇచ్చింది ఆయనే అంటూ మాజీ సీఎంపై ప్రశంసల జల్లులు కురిపించారు. పాలిటిక్స్ లోకి వస్తారా అని ఆమెను తరచుగా అడుగుతుంటారు. అయితే తాను ఏ పార్టీలో ఉన్నా, అన్యాయాన్ని సహించలేదని.. సొంత పార్టీ లీడర్స్ తప్పు చేస్తే సైలెంట్ గా ఉండకుండా ప్రశ్నించేతత్వం తనదన్నారు. ఇలాంటి కారణాలతో పాలిటిక్స్ లోకి రాలేదన్నారు. కస్తూరి తెలుగులో నిప్పురవ్వ, అన్నమయ్య, మా ఆయన బంగారం, భారతీయుడు సినిమాల్లో నటించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ లో చిరు తల్లి పాత్రలో కనిపించారు కస్తూరి.
ఆ నేతలకు థ్యాంక్స్ చెబుతూనే ఉంటాను..
ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ పై తనకు అంత అవగాహన లేదన్నారు. తాను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, దివంగత నేత వైఎస్సార్ లకు వీరాభిమానిని అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తాను ఇంటి నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో ప్రతిసారి చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓఆర్ఆర్ జర్నీని తాను ఎంజాయ్ చేస్తానని తెలిపిన నటి కస్తూరి.. హైదరాబాద్ ను చూస్తే లీడర్స్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నారు. నేతల విజన్ కారణంగా హైదరాబాద్ బాగా డెవలప్ అయిందన్నారు. అయితే పాలిటిక్స్ లో తాను కొనసాగడం కష్టమని, తప్పు చేస్తే సొంత పార్టీ వారినే ప్రశ్నించేతత్వం తనదన్నారు. కానీ సొంత పార్టీ లీడర్లు తప్పు చేస్తే సైలెంట్ గా ఉండాల్సి వస్తుందని తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం నటీమణులు కుష్బూ అయితే బీజేపీ నేతలు తప్పు చేసినా, ఏపీ మంత్రి ఆర్కే రోజా అయితే వైసీపీ నేతలు మిస్టెక్ చేస్తే సైలెంట్ గా ఉండిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
అప్పుడు బెంగళూరు, ఇప్పుడు హైదరాబాద్ !
తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని, హైదరాబాద్ కు బ్లూ ప్రింట్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు నటి కస్తూరి శంకర్. అప్పట్లో కేంద్రంలో కూడా చంద్రబాబు చాలా స్ట్రాంగ్ అని, కేంద్ర ప్రభుత్వం ఆయన చేతుల్లోనే ఉండేదంటూ నటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు డైనమిక్ లీడర్ అని, సూటు బూటులో అమెరికాకు వెళ్లి హైదరాబాద్ విజన్ ను రిప్రజెంట్ చేసిన ఘనత టీడీపీ అధినేతకు దక్కుతుందన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో బెంగళూరు కేంద్రంగా ఐటీ హబ్ ఉండేదని, చంద్రబాబు హయాం నుంచి హైదరాబాద్ ఐటీ హబ్ గా కొనసాగుతోందన్నారు.
తెలంగాణ పాలిటిక్స్ లో మంత్రి కేటీఆర్ కు తాను పెద్ద ఫ్యాన్ అన్నారు నటి కస్తూరి. టీడీపీ హయాంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా మరో మెట్టుపై నిలవగా, ప్రస్తుతం మంత్రి కేటీఆర్ సిటీని మరింత ముందుకు తీసుకెళ్తూ కంటిన్యూ చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్ నడిచినా, మాట్లాడినా, ఆయన ఏం చేసినా తనకు ఇష్టమంటూ నటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మోహమాటంగా ఉన్న విషయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పే కస్తూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read: Kasthuri On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్శనల్ లైఫ్ చూసి ఓటేయరు - రోజాకు అదే బలం: సీనియర్ నటి కస్తూరీ
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాలకృష్ణ
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం