Telangana Elections 2023 : బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం - హస్తం గూటికి చేరిన దివ్యవాణి
Divyavani : బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని సినీ నటి దివ్యవాణి అన్నారు. మాణిక్ రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
Telangana Elections 2023 Divyavani : బంగారు తెలంగాణ కాంగ్రెతోనే సాధ్యమని సినీ నటి, రాజకీయ నేత దివ్య వాణి అన్నారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మణిక్ ఠాక్రే ఆమెకు కండువా కంపి ఫార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌లో పనిచేయాలనే హస్తం పార్టీలో చేరానన్నారు. విజయశాంతి కూడా కాంగ్రెస్ చేరారని గుర్తు చేశారు. విజన్ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల టీడీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. ప్రతి పేదవాడు బాగుపడాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. అహంకార ప్రభుత్వంలో బానిస బ్రతుకులనుండి బయట పడేందుకు కాంగ్రెస్ రావాలని, ప్రజల భవిష్యత్తును కాపాడడం, దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా పనిచేస్తా. ప్రగతి భవన్ కాదిది ప్రజాభవన్ తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ అంశం తనకు బాగా నచ్చిందని దివ్వ వాణి తెలిపారు.
దివ్యవాణి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అధికార ప్రతినిధిగా చురుకుగా పని చేశారు. టీడీపీలో ఆమెకు మంచి ప్రాధాన్యం లభించింది. అయితే ఓ సారి మహానాడులో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని అసంతృప్తికి గురయ్యారు.పార్టీ నేతలు తనతో సక్రమంగా ప్రవర్తించలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. వైసీపీలో చేరుతారని అనుకున్నారు కానీ.. చేరలేదు. ఆమె వైసీపీలో చేరకుండా కొంత మంది నేతలు అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. జనసేనలో చేరే ఆలోచన చేయలేదు. చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే మళ్లీ టీడీపీలో చేరుతానని దివ్యవాణి పలు ఇంటర్యూల్లో చెప్పారు.కనీ టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
తర్వాత తెలంగాణలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలని అనుకున్నారు. బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు. ఓ సారి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో సమావేశం అయ్యారు. పార్టీ లో చర్చించి చేర్చుకుంటామని ఆయన చెప్పారు. కానీ బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల సమయంలో ఎవరు పార్టీలో చేరినా మంచిదేనని అనుకుంటున్న కాంగ్రెస్... దివ్యవాణిని చేర్చుకున్నారు. తదుపరి ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారో కానీ.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏదో ఓ పార్టీలో చేరాలనుకున్న దివ్యవాణి చివరికి.. కాగ్రెస్ పార్టీ చెంతకు చేరారు.