అన్వేషించండి

HMDA News: శివబాలకృష్ణ ఎఫెక్ట్! మిగతా ఉద్యోగుల గుండెల్లో రైళ్లు - హెచ్ఏండీఏలో ఏసీబీ తనిఖీలతో ఆందోళన

Hmda Lower level Staff in Concern: అవినీతి కేసులో హెచ్ఎండీఏ డైరెక్టర్ అరెస్ట్ తో కార్యాలయంలోని దిగువస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. ఏసీీబీ అధికారుల తనిఖీలతో ఉద్యోగుల్లో కలవరం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ(Siva Balakrishna) అరెస్ట్ తో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పెద్దచేప వలకు చిక్కడంతో చిన్న చేపలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తమ పేర్లు ఎక్కడ భయటకు వస్తాయేమోనని భయపడి చస్తున్నారు. కొన్ని రోజులు హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో లంచం పేరు చేబితే అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఏమైనా పనులు ఉంటే ఈ వ్యవహారం మొత్తం సద్దుమణిగిన తర్వాత చూద్దామంటూ దాటేవేస్తున్నారు

ఏసీబీ దాడులతో అలజడి

హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో ఏ పని జరిగినా...ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా చేయి తడపాల్సిందే. ఈ విషయం ఆ కార్యాలయానికి ఒక్కసారైనా వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇక్కడ సమాన పనికి సమాన వేతనం ఇస్తారో లేదో తెలియదు కానీ...అవినీతి సొమ్ములో మాత్రం వాటాల పంపకం సమానంగా ఉంటుంది. ఫ్యూన్ దగ్గర నుంచి...డైరెక్టర్ వరకు ఎవరికి చెల్లించాల్సింది వారికి ముట్టజెప్పాల్సిందే. లేకపోతే నీ ఫైల్ అక్కడే ఆగిపోతుంది. ఏసీబీ(ACB) అధికారుల గాలానికి ఏకంగా హెచ్ఎండీఏ డైరెక్టర్ శివబాలకృష్ణ(Siva Balakrishna) దొరకడంతో....దిగువస్థాయి సిబ్బంది గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే డైరెక్టర్ ఒక్కరే సంతకం పెడితే సరిపోదు. ఖచ్చితంగా దిగువస్థాయి సిబ్బంది పాత్ర ఉండాల్సిందే. అధికారిక లెక్కల ప్రకారమే శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల విలువ రూ.250 కోట్లు దాటిపోవడంతో....ఇప్పుడు దిగువస్థాయి సిబ్బంది పాత్రపైనా ఏసీబీ(ACB) అధికారులు దృష్టి సారించారు. కార్యాలయంలో ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు, బినామీలు దాడుల భయంతో దినదిన గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏసీబీ(ACB) అధికారుల నుంచి పిలుపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తమ పై అధికారులు ఆదేశాలు పాటించినందుకు అవినీతి మరకలు తమకు ఎక్కడ అంటుకుంటాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏసీబీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని భయంగా గడుపుతున్నారు.

హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాలు

శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ(ACB) అధికారులు...ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అమీర్ పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ లోఉన్న హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కీలకమైన పత్రాలు జిరాక్స్‌ తీసుకోవడంతో పాటు కొన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారు.అన్ని దస్త్రాల పరిశీలన అనంతరం....హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగంలో ఆయన సూచనల మేరకు పలువురు ఉద్యోగులు పనిచేసినట్లు గుర్తించార. ఇప్పటి వరకు భారీ బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, గేటెడ్‌ కమ్యూనిటీ లేఅవుట్‌లకు ఇచ్చిన అనుమతుల పత్రాలను పరిశీలించిన అధికారులు....భారీగా అవకతవకలకు పాల్పడినా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. అలాంటి ఫైళ్ల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో ప్లానింగ్‌ ఆఫీసర్‌తో పాటు ఏపీవోలు(APO), జేపీవో(JPO)లు తనిఖీ చేసి నివేదికను రూపొందించాల్సి ఉన్నా, డైరెక్టర్‌గా ఉన్న బాలకృష్ణ చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ(HMDA) డైరెక్టర్‌ కింద పనిచేసిన కొందరు అధికారులను కూడా ఏసీబీ(ACB) అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శివ బాలకృష్ణ విచారణ పూర్తయే వరకు హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలోని కొందరు అధికారులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

టాప్ హెడ్ లైన్స్

బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget