అన్వేషించండి

AAP in Telangana : తెలంగాణపై ఆమ్ఆద్మీ ఆశలు ! కోదండరాం పార్టీని విలీనం చేస్తారా ?

తెలంగాణపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు పెట్టుకుంది. జోరుగా చేరికలకు ప్లాన్ చేసుకుంటోంది. కోదండరాం పార్టీతో విలీనం కోసం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.


పంజాబ్‌లో గెలుపు తర్వాత దేశ వ్యాప్తంగా బలపడాలని భావిస్తున్న 'ఆప్'.. తెలంగాణపైనా దృష్టి సారించింది. తెలంగాణ మేధావులతో, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నది. దక్షిణాదిలో ప్రవేశించాలంటే  తెలంగాణ సరైన వేదిక అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.  ఇందుకోసమే తన ఫోకస్ ను తెలంగాణ పై పెట్టారు.  అంబేద్కర్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో పర్యటించనున్న కేజ్రీవాల్ కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ లో పార్టీనికి బలోపేతం చేసేందుకు, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు  సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొదటగా ఉమ్మడి వరంగల్ పై దృష్టి సారించి కార్యచరణ మొదలు పెట్టారు. ఆప్ ఎంట్రీతో ఓరుగల్లు రాజకీయాల్లో కొత్త అధ్యయాలు మొదలు కాబోతున్నాయి.  

వరంగల్‌లో ఆమ్ ఆద్మీ కార్యకలాపాల జోరు !

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో మొదటగా వరంగల్ లో కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించింది. పార్టీని బలోపేతం చేసేందుకు అధికార పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకుపోవాలని వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ జనసమితి ఆప్‌లో విలీనం కానున్నదనే  వార్తలు వస్తుండటంతో ఇతర పార్టీలో నేతలు కూడా ఆప్ చేరేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.  తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన, ఫేస్ వ్యాల్యూ కలిగిన నేతలను, మేధావి వర్గాలను, విద్యార్థి సంఘం నాయకులను   చేర్చుకోవడం ద్వారా  పార్టీ ప్రజల్లోకి వెళుతుందని ఆప్  భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఆదివారం వరంగల్ జిల్లాలో ఆప్ సౌత్ ఇండియా ఇన్‌చార్జి సోమ్‌నాథ్  భారతి  పర్యటనలు చేపట్టారు.  హన్మకొండ, నర్సంపేట నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, జెండాలను ఆవిష్కరించారు. అక్కడి  స్థానిక నేతలను పార్టీలో చేర్చుకొని నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్బంగా ఆప్ నేత సోమ్ నాథ్  టీఆర్ ఎస్ పార్టీపై సీఎం కేసిఆర్ పై విమర్శలు గుప్పించారు.  తెలంగాణలో అవినీతి, మాఫియా రాజకీయాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందన్నారు.  ఢిల్లీ తరహాలో పాలన అందించడానికి మీ బిడ్డగా తెలంగాణలో అడుగుపెడుతున్న కేజ్రీవాల్ ను అక్కున చేర్చుకొని, ఆదరించాలని కోరారు. 

సామాన్యుడికే అధికారం అనేది ఆమ్ ఆద్మీ నినాదం !

 సామాన్యుడికే అధికారం అనే నినాదంతో  ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. యువతను, మేధావులను, విద్యార్థి సంఘం నాయకులను, ఫేస్ వాల్యూ కలిగిన కమ్యూనిస్ట్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉన్నవారు ఆప్ లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫేస్ వ్యాల్యూ కలిగి స్థానికంగా సమస్యలపై ధీర్ఘకాలం నుంచి పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఆప్ నాయకులు పావులు కదుపుతున్నారు. ఏప్రెల్ 14న హైదరాబాద్ లో కేజ్రీవాల్ పర్యటన ఉండటంతో ఈ లోపు పార్టీలో చేరే వారిని సిద్ధం చేసేందుకు కార్యచరణ మొదలు పెట్టారు.  తెలంగాణలో మొదటి సారిగా ఉమ్మడి వరంగల్ ప్రాంతంపై ఆప్ నేతలు దృష్టి సారించడంతో ఓరుగల్లు రాజకీయాల్లో కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి. సాన్యుడికి అధికారం అనే నినాధంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆప్ పార్టీ రాష్ట్రంలో ప్రవేశించడంతో కొత్త తరం నేతలు పుట్టుకు వస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ జనసమితి విలీనంపై ప్రచారం !

తెలంగాణ జనసమితి పార్టీని ఆప్ లో విలీనం కానుందని కోదండరాం రాష్ట్ర నాయకుడిగా ఆప్ పార్టీని ముందుకు నడిపించున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలతో 
తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన, ఫేస్ వ్యాల్యూ కలిగిన కోదండరాంను చేర్చుకోవడం ద్వారా తమ పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నది. జనసమితి కేడర్ కూడా 'ఆప్'లో విలీనానికే సుముఖత చూపుతున్నారని అంటున్నారు. రెండు పార్టీల మధ్య విలీనం కోసం, కలిసి పనిచేయడం కోసం చర్చలూ జరుగుతున్నాయి. వచ్చే నెల 14న కేజ్రీవాల్ హైదరాబాద్ టూర్ సందర్భంగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. విలీన ప్రక్రియను ఇటు కోదండరాం, అటు ఆప్ వర్గాలు ధ్రువీకరించడంలేదు. రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నది నిజమేనని, రెండు వైపుల నుంచీ విలీనం ఆలోచనలున్నాయని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైతే విలీనం అనే మాట లేదని కోదండరాం చెబుతున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget