DCM Van Accident: అల్వాల్ లో డీసీఎం వ్యాన్ బీభత్సం - తొమ్మిదేళ్ల బాలుడు మృతి
Hyderabad News: సికింద్రాబాద్ అల్వాల్ లో ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పాదచారుల పైకి దూసుకు రాగా ఓ తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
DCM Van Hit Boy in Alwal: సికింద్రాబాద్ అల్వాల్ (Alwal)లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఓ సూపర్ మార్కెట్ కు సరుకులతో వచ్చిన డీసీఎం (DCM) వ్యాన్ ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకొచ్చింది. ఇదే సమయంలో తల్లితో కలిసి అటుగా వెళ్తున్న తొమ్మిదేళ్ల బాలుడు తిరుపాల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుపాల్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్వాల్ గంగపుత్ర కాలనీకి చెందిన తిరుపాల్.. కృష్ణవేణి స్కూల్ లో మూడో తరగతి చదువుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తండ్రిని చూసేందుకు తల్లితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమారుడి మృతితో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Also Read: Yatra 2: 'యాత్ర 2' థియేటర్‌లో పవన్, జగన్ ఫ్యాన్స్ మధ్య గొడవ - తర్వాత ఏం జరిగిందంటే?