YouTube: యూట్యూబ్‌లో ఇకపై అవి కనిపించవు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
యూట్యూబ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై డిస్‌లైకుల సంఖ్య యూజర్లకు కనిపించబోదు. కేవలం కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ లెక్క కనిపించనుంది.
యూట్యూబ్ త్వరలో తన ప్లాట్‌ఫాంలో డిస్‌లైక్‌ల సంఖ్య కనిపించకుండా చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై వివాదాలు తలెత్తుతున్నాయి. వీడియోపై ప్రజల అభిప్రాయాన్ని తెలియకుండా దాచేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే కంటెంట్ క్రియేటర్లకు హెరాస్‌మెంట్ జరగకుండా.. ‘డిస్‌లైక్స్’ దాడి జరగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ అంటోంది.
డిస్‌లైక్ బటన్‌ను పూర్తిగా తొలగించబోవడం లేదని.. వాటి సంఖ్యను మాత్రం కనిపించకుండా చేస్తామని యూట్యూబ్ అంటోంది. అయితే ఈ డిస్‌లైక్‌ల సంఖ్య ఆ యూట్యూబ్ చానెల్ వారికి ప్రైవేట్‌గా కనిపించనుంది. యూట్యూబ్ స్టూడియోలో దీన్ని చెక్ చేసుకోవచ్చు.
కంటెంట్ క్రియేటర్లపై ఈ పబ్లిక్ డిస్‌లైక్ కౌంట్ ఎఫెక్ట్ ప్రత్యక్షంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే వీడియోలు క్లిక్ బెయిట్లా, స్పాం లేదా మిస్‌లీడింగా అనే విషయాలు కూడా డిస్‌లైకుల ద్వారా ఆడియన్స్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ డిస్‌లైకు దాడుల కారణంగా యూట్యూబ్ ప్రయాణాన్ని ఇటీవలే ప్రారంభించిన చిన్న క్రియేటర్లపై ప్రభావం పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే ఏ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారో యూట్యూబ్ తెలపలేదు. కొన్ని నెలలపాటు వివిధ రకాల టెస్టులు చేసి, ఆ ఫలితాలపై క్షుణ్ణమైన విశ్లేషణ చేశాకనే ఈ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ తెలిపింది.
అయితే ఈ నిర్ణయానికి ప్రజల నుంచి విభిన్నమైన స్పందనలు ఎదురవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థించగా.. మరి కొందరు మాత్రం యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదంటున్నారు. ప్రజల అభిప్రాయం మిగతా వ్యూయర్స్‌కి తెలియకుండా పోతుందని.. దీని వల్ల మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్, హెడ్డింగులు ఎక్కువయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
if a creator can still see their total dislikes from the dashboard this change literally only is good for brands/corporations lol
— connor (@ConnorEatsPants) November 10, 2021
This isn't to protect "small creators" it's to protect brands. Everyone knows it.
— TheQuartering (@TheQuartering) November 10, 2021
I like this change, makes youtube more healthy for the content creator and let's us experiment more with different types of videos
— Jawhnny B (@Jawhnny_B) November 10, 2021
This is a joke. To protect small creators? This is to protect big corporations from criticism and to support their bottom line, full stop. Really disappointing, gonna have to reconsidery my premium sub.
— Logan (@Logarithrn) November 10, 2021
Horrible decision! The sentiment around what has been expressed should be public knowledge. This only protects the creators and makes them ignorant of where they might have gone wrong and constructive criticism! https://t.co/xr89IG9JB8
— ANMOL JAMWAL (@jammypants4) November 10, 2021
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!