అన్వేషించండి

Xiaomi Civi: షియోమీ ఫోన్లలో అత్యధిక బ్యాటరీ బ్యాకప్.. సీవీ సిరీస్ వచ్చేస్తుంది.. అదిరిపోయే కెమెరాలు కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను సెప్టెంబర్ 27వ తేదీన లాంచ్ చేయనుంది. అదే షియోమీ సీవీ సిరీస్.

షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అదే షియోమీ సీవీ(Civi) స్మార్ట్ ఫోస్ సిరీస్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీన చైనాలో ఇవి లాంచ్ కానున్నాయి. యువ కస్టమర్లే టార్గెట్‌గా వీటిని కంపెనీ లాంచ్ చేయనుంది. స్లిమ్ బిల్డ్, అదిరిపోయే కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. సివి మోడల్స్‌లో ఏయే మోడల్స్ ఉండనున్నాయో తెలియరాలేదు. యువత కోసం షియోమీ చైనాలో సీసీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇవి దానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా లాంచ్ కానున్నాయి.

వీబో పోస్టులో షియోమీ తన సీవీ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు(మనదేశ కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు) ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. దీనికి సంబంధించిన టీజర్ పేజీని కూడా షియోమీ షేర్ చేసింది. దీని లైట్ వెయిట్ డిజైన్, ఎన్‌హేన్స్‌డ్ కెమెరా పెర్ఫార్మెన్స్‌ను ఇది హైలెట్ చేసింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఎంఐ సీసీ9 సిరీస్‌లో లాంచ్ అయిన ఎంఐ సీసీ9, ఎంఐ సీసీ9ఈ, ఎంఐ సీసీ9 మెయిటు కస్టం ఎడిషన్, ఎంఐ సీసీ9 ప్రో ప్రీమియం డిజైన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విభిన్నమైన కెమెరా, వీడియో క్యాప్చరింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడం కోసం కెమెరాల మీద ఈ సిరీస్ ఫోకస్ చేసే అవకాశం ఉంది.

ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం లాంచ్ అయిన అన్ని షియోమీ ఫోన్లలో అత్యధిక బ్యాటరీ లైఫ్ వచ్చే ఫోన్ ఇదేనని కంపెనీ అంటోంది. ఇందులో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని కూడా కంపెనీ టీజ్ చేసింది.

షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ కూడా మనదేశంలో సెప్టెంబర్ 29వ తేదీన లాంచ్ చేయనుంది. ఇందులో 90 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4250 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లతో పాటు 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది.

అయితే షియోమీ సీవీ సిరీస్‌లో కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అవుతాయా లేకపోతే మిగతా మార్కెట్లలో కూడా అందుబాటులోకి వస్తాయా అనే విషయం తెలియరాలేదు. ఎంఐ సీసీ9 మోడల్స్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫోన్లు వేరే దేశాల్లో రీబ్రాండెడ్ వెర్షన్లుగా లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల విషయంలో కూడా షియోమీ ఇదే వ్యూహం ఫాలో అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget