WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 కార్యక్రమంలో కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్ చేసింది.
Apple WWDC 2023: యాపిల్ తన డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్లో ఐప్యాడ్ఓఎస్ 17, వాచ్ఓఎస్ 10, మ్యాక్ఓఎస్ 14 అప్‌డేట్స్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్నో సరికొత్త ఫీచర్లను కూడా యాపిల్ అందించింది. ఇప్పుడు ఈ అన్ని అప్‌డేట్స్‌లో ఏయే ఫీచర్లు ఉండనున్నాయో చూద్దాం.
iPadOS 17 ఫీచర్లు
1. ఫ్లెక్సిబుల్ లేఅవుట్
2. ఆఫ్‌లైన్ మ్యాప్
3. మెసేజ్ లైవ్ స్టిక్కర్
4. ప్రిడిక్టివ్ టెక్స్ట్
5. రేంజ్‌లో లేనప్పుడు కూడా ఎయిర్‌డ్రాప్ ఉపయోగించే అవకాశం
6. ఏఐ పవర్డ్ పీడీఎఫ్
7. ఎక్స్‌టర్నల్ కెమెరా
watchOS 10 ఫీచర్లు
1. నావిగేట్ చేయడానికి కొత్త మార్గాలు
2. టోపోగ్రాఫిక్ మ్యాప్
3. నేమ్‌డ్రాప్
4. పాలెట్, స్నూపీ ఫేస్
5. కొత్త ఫిట్‌నెస్ ఫీచర్లు
6. మానసిక ఆరోగ్యాన్ని కూడా ట్రాక్ చేసే ఫీచర్
7. డేలైట్ మోడ్
8. గ్రూప్ ఫేస్‌టైమ్ ఆడియో
9. స్మార్ట్ స్టాక్
10. డైనమిక్ 3డీ ఎలివేషన్ డయల్
11. యాప్ కోసం పూర్తిగా కొత్త డిజైన్
MacOS 14 ఫీచర్లు
1. కొత్త స్క్రీన్ సేవర్
2. కెమెరా రియాక్షన్
3. స్క్రీన్ షేరింగ్ పికర్
4. డాక్ వెబ్ యాప్స్
5. ఆన్ ది డెస్క్‌టాప్ విడ్జెట్స్
6. సఫారిలో బ్రౌజర్ ప్రొఫైల్స్
7. మెసేజ్‌ల కోసం ప్రత్యక్ష స్టిక్కర్లు
7. గేమ్ మోడ్
8. గ్రూప్ వీడియో కాల్‌ల కోసం ఓవర్‌లేస్.
మోస్ట్ అవైటెడ్ యాపిల్ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను కూడా WWDC 2023లో యాపిల్ లాంచ్ చేసింది. యాపిల్ లాంచ్ చేసిన మొదటి మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ ఇదే. ఇందులో హై రిజల్యూషన్ డిస్‌ప్లేలు అందించనున్నారు. మన కళ్లతో, వాయిస్‌తో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. దీంతోపాటు ఇందులో బోలెడన్ని సెన్సార్లు ఉండనున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) రెండిటినీ ఇది సపోర్ట్ చేయనుంది. ఈ హెడ్‌సెట్‌లో కెమెరాలు కూడా ఉండనున్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్ బ్యాటరీ ఉండదు. దాన్ని సపరేట్‌గా అందిస్తారు.
ఇవి చూడటానికి అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ డిస్‌ప్లే ఉన్న స్కీ గూగుల్స్ తరహాలో ఉంటాయి. ఫ్యాబ్రిక్ లైన్డ్ మాస్క్, స్ట్రాప్‌ను కూడా దీంతోపాటు అందించనున్నారు. దీని బ్యాటరీ ప్యాక్‌ను డివైస్ ఎడమవైపు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని మన కంటి చూపుతో కంట్రోల్ చేయవచ్చని యాపిల్ తెలిపింది. దీనికి డిస్‌ప్లే పైన ఉన్న గ్రాఫిక్ ఎలిమెంట్స్‌ను చూడాలి. ఐ సైట్ అనే ఫీచర్ ద్వారా తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వినియోగదారులు తెలుసుకోవచ్చు. కుడివైపు ఉండే డయల్ ద్వారా ఏఆర్, వీఆర్ మోడ్లను మార్చుకోవచ్చు.
అమెరికాలో దీని ధర 3,499 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో రూ.2,88,700) నిర్ణయించారు. యాపిల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది విక్రయానికి రానుంది. యాపిల్ స్టోర్లలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!
This is iPadOS 17 #WWDC23 pic.twitter.com/fHcSn6Pl7Y
— Apple Hub (@theapplehub) June 5, 2023
Apple introduces watchOS 10 #WWDC23 pic.twitter.com/6k1uFr7lZf
— Apple Hub (@theapplehub) June 5, 2023
mac OS 14 Sonoma. pic.twitter.com/MME3CZZblw
— iRobinPro 🪺 (@iRobinPro) June 5, 2023