WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి కొత్త ఫీచర్!
WhatsApp Group calls: వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందిస్తుంది.
వాట్సాప్ కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి యాప్‌లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. 'కాల్స్' ట్యాబ్‌లో కంపెనీ ఈ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం మీరు కాల్స్ ట్యాబ్‌కు వెళ్లినప్పుడు పైన కాల్ లింక్ ఎంపికను చూస్తారు. అయితే త్వరలో కంపెనీ దాన్ని 'న్యూ కాల్' ఆప్షన్‌తో భర్తీ చేయబోతోంది. ఇది కాకుండా త్వరలో మీరు 31 మందిని కాల్‌కు యాడ్ చేయగలరు. అంటే మీరు కాల్ చేయడం ప్రారంభించిన వెంటనే ఒకేసారి 31 మందిని కాల్‌కు యాడ్ చేసే ఆప్షన్ లభించనుంది. ప్రస్తుతం మీరు మొదటగా 15 మందిని మాత్రమే జోడించగలరు. ఇప్పుడు ఈ సంఖ్యను 32 మందికి పెంచనున్నారు.
ఈ అప్‌డేట్ గురించిన సమాచారం Wabetainfo వెబ్ సైట్ షేర్ చేసింది. ఈ అప్‌డేట్ వాట్సాప్ బీటా 2.23.19.16లో కనిపించింది. వాట్సాప్‌కు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను పొందడంలో మీరు కూడా మొదటి వ్యక్తి కావాలనుకుంటే, మీరు కంపెనీ బీటా ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకోవచ్చు.
వాట్సాప్ వీడియో కాలింగ్ అవతార్ ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. ఈ ఫీచర్ కింద మీరు ఎవరికైనా వీడియో కాల్ చేసినప్పుడు, మీ ముఖానికి బదులుగా యూజర్ అవతార్‌ను చూస్తారు. ఈ అవతార్‌లు మీ ముఖ కవళికలు, సంజ్ఞలను కూడా అనుకరిస్తాయి. మీరు వారితో మాట్లాడుతున్నట్లుగా యూజర్లు అనుభూతి చెందుతారు. ఈ ఫీచర్ మీ వీడియో కాలింగ్ అనుభవాన్ని మారుస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్‌ల వద్ద అందుబాటులో ఉంది. వీటిని సాధారణ యూజర్లు త్వరలో పొందుతారు.
వాట్సాప్ ఇటీవల భారతదేశంలో ఛానెల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సహాయంతో మీకు ఇష్టమైన కంటెంట్ క్రియేటర్ లేదా సెలబ్రిటీతో కనెక్ట్ అవ్వవచ్చు. రాబోయే కాలంలో కంపెనీ ప్రతి ఒక్కరికీ వారి సొంత ఛానెల్‌ని సృష్టించే అవకాశాన్ని కూడా ఇస్తుంది. వాట్సాప్ ఛానెల్ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ లాంటిది. దీనిలో మీరు మీ కంటెంట్ క్రియేటర్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.
మరోవైపు హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 5జీ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీని సపోర్ట్ చేయనుంది. రెండు స్టోరేజ్ ఆప్షన్లు, మూడు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫోన్ వెనకవైపు 200 మెగాపిక్సెల్, ముందువైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందించారు. దీని కొనుగోలుపై రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు.
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. అయితే ఎర్లీ బర్డ్ సేల్ కింద దీన్ని రూ.27,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించగా, ఎర్లీ బర్డ్ సేల్ కింద రూ.29,999కే దక్కించుకోవచ్చు.
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial