Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.
Whatsapp Hide Lock Chats: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కొంతకాలం క్రితం 'చాట్ లాక్' ఫీచర్‌ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికే కొత్త అప్‌గ్రేడ్‌ను కూడా తీసుకువచ్చారు. అయితే లాక్ చేసిన తర్వాత కూడా సమస్య ఏమిటంటే చాట్ లాక్ చేసిన తర్వాత కూడా వాటికి సంబంధించిన లిస్ట్ పైన ఒక ఫోల్డర్‌లో కనిపిస్తుంది. అందులో లాక్ చేయబడిన చాట్‌లు ఉంటాయి. ఇక్కడ మీరు కొన్ని చాట్‌లను లాక్ చేశారని ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈ సమస్యకు ముగింపు పలకడానికి కొంత కాలం తర్వాత వాట్సాప్ మరో కొత్త ఫీచర్ 'హైడ్ లాక్ ఫోల్డర్'ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
వాట్సాప్ చాట్‌ను లాక్ చేయడానికి ముందుగా మీరు యాప్‌కి వెళ్లి ఎవరి చాట్‌ను లాక్ చేయాలనుకుంటున్నారో వారి ప్రొఫైల్‌కు వెళ్లండి. ప్రొఫైల్ లోపలికి వెళ్లిన తర్వాత మీకు చాట్ లాక్ ఆప్షన్ వస్తుంది. దీన్ని ఆన్ చేసిన వెంటనే, మీ చాట్ ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ అవుతుంది. అక్కడ నుంచి ప్రత్యేక ఫోల్డర్‌కి వెళుతుంది.
చాట్ లాక్ అయిన తర్వాత మీరు 'లాక్డ్ ఫోల్డర్'పై క్లిక్ చేయవచ్చు. మీరు ఇక్కడకు వెళితే మీకు పైభాగంలో కుడి వైపు మూడు చుక్కలు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాక్ చేసిన చాట్‌ను హైడ్ చేయడం అనే ఆప్షన్‌ను పొందుతారు. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీ లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్‌కు భిన్నంగా ఉండే పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. తద్వారా ప్రైవసీ మెయింటెయిన్ అవుతుంది. పాస్‌వర్డ్‌ని సెట్ చేసిన తర్వాత మీరు లాక్ చేసిన చాట్‌లు అదృశ్యం అవుతాయి.
హైడ్ అయిన చాట్‌లు మళ్లీ ఎలా కనిపిస్తాయి?
లాక్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేయడానికి యాప్ సెర్చ్ బార్‌లో సెట్ చేసిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. మీరు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన వెంటనే, లాక్ చేసిన ఛాట్‌ల ఫోల్డర్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో కేవలం మీరు మాత్రమే మీ చాట్‌లను చూడగలరు.
యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక యూజర్లు ఉన్న మెసేజింగ్ యాప్స్ స్థానంలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 200 కోట్లకు పైగా డైలీ యాక్టివ్ యూజర్స్ వాట్సాప్‌కు ఉండటం విశేషం. యూజర్ బేస్ విషయంలో వాట్సాప్ దరిదాపుల్లో కూడా మరే యాప్ లేదు. దీంతో ఆ యూజర్ బేస్‌ను మరింత పెంచుకోవడానికి వాట్సాప్ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!