అన్వేషించండి

ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ.

ప్రతీ పదేళ్లకు టెక్నాలజీ అప్ గ్రేడ్ అవుతూ వస్తోంది. 1990 దశకంలో మనం కంప్యూటర్లు చూశాం. కొత్త మిలీనియం మొదట్లో సెల్ ఫోన్ అందరి చేతుల్లోకి రావటం మొదలైంది. ఆ తర్వాత ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం లాంటి అనేక సంస్థలు చిన్న చిన్న స్టార్టప్స్ గా మొదలై..ఇప్పుడు దిగ్గజ సంస్థలుగా ఎదిగాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు వరల్డ్ లో నెంబర్ 1 సెర్చ్ ఇంజన్. మనకి ఏం కావాలన్నా నెట్ లో గూగుల్ తల్లిని అడగటం మొదలు పెట్టాం. ఇప్పుడు గూగుల్ కి పోటీగా ఓ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ పోటీకి వస్తోంది. ఛాట్ బోట్స్ మనకందరికీ తెలుసు చాలా చోట్ల అప్లికేషన్స్ అన్నీ చాట్ బోట్స్ తోనే రన్ అవుతున్నాయి. అలాంటి దశను దాటుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్న ఓ చాట్ బోటే చాట్ జీపీటీ. చాట్ అంటే మాట్లాడటం. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్సఫార్మర్. అంటే ఈ చాట్ బోట్ ను ముందు ట్రైన్డ్ చేస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి ఇంక్లుడ్ చేయటం ద్వారా ఈ చాట్ జీపీటీ మనకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. 

ఇంతకీ చాట్ జీపీటీ వల్ల ఎందుకు దిగ్గజ సంస్థలు ముప్పంటే. మనం నెట్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్ లో ఏదైనా సెర్చ్ చేస్తే చాలు వందలకొద్దీ ఇన్ఫర్మేషన్ వచ్చి పడిపోతుంటుంది. ఏది రియలబుల్ ఏది కాదు..ఏది మిస్ లీడ్ చేసే విషయమో తెలుసుకోవటం కష్టం. ఒక్క పదం తో సెర్చ్ చేస్తే వంద ఆప్షన్లు వస్తాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మళ్లీ మనకే పెద్ద టాస్క్. చాట్ జీపీటీ అలా కాదు...ఒకటే ఆన్సర్ ఇస్తుంది. ప్రభాస్ అంటే ప్రభాస్ ఎవరు ఏంటీ సింపుల్ గా ఓ ముప్పై పదాల్లో చెప్పేస్తుంది. ఏదైనా ప్రాబ్లం దానికి చెప్పామనుకోండి అది మొత్తం సాల్వ్ చేసి ఇస్తుంది. 
   
Open AI అనే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ మీద వర్క్ చేస్తున్న కంపెనీ ఈ చాట్ జీపీటీని లాంచ్ చేసింది. నవంబర్ లో అనౌన్స్ చేసి మొన్న డిసెంబర్ 15న లాంచ్ చేశారు . కేవలం ఐదు రోజుల్లోనే వన్ మిలియన్ యూజర్లను ఈ సర్వీస్ దక్కించుకుంది. ఈ నెంబర్ అచీవ్ అవ్వటానికి చాలా పెద్ద కంపెనీలకు కూడా చాలా టైమ్ పట్టింది. అందుకే గూగుల్ లాంటివి చాట్ జీపీటీ మీద రెడ్ కోడ్ పెట్టాయి. అవి చేస్తున్న పనులు..తెస్తున్న మార్పులను నిశితంగా పరిశీలిస్తుంది. ఇంతకీ చాట్ జీపీటీ మన సిస్టమ్ లోనో ల్యాప్ ట్యాప్ లోనో వాడటం ఎలా. ఓపెన్ ఏఐ వెబ్ సైట్ లో కి వెళ్లి లాగిన్ అవ్వచ్చు..లేదంటే గూగుల్ సెర్చ్ చాట్ జీపీటీ అని కొట్టి..ఓపెన్ ఏఐ వెబ్ సైట్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మన మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇస్తే...ఓ ఐడీ ని మొబైల్ నెంబర్ కి పంపిస్తుంది. అది ఎంటర్ చేస్తే ఓ యాక్టివేషన్ లింక్ ను మెయిల్ కు పంపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఈ చాట్ జీపీటీ లాంచ్ అయిపోతుంది. 

అయితే దీంతో ప్రస్తుతానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనిని 2021 వరకే అప్ డేట్ చేశారు. సో ఇది చెప్పే విషయాలన్నీ 2021 వరకే. ఆ తర్వాత తనకు తెలియదని చెబుతుంది. ఎందుకంటే దీన్ని ప్రస్తుతానికి ఇంటర్నెట్ కు లింక్ చేయలేదు. త్వరలో చేయనున్నట్లు రూపకర్తలు ప్రకటించారు. గూగుల్ కూడా చాట్ జీపీటీలాంటి దాన్ని క్రియేట్ చేసి తన సెర్చ్ ఇంజిన్ లో పెట్టాలని భావిస్తోంది. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీగా..యూజర్ పర్ స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తుంటే అడిగిన దానికి మాత్రమే కచ్చితమైన సమాచారం ఇచ్చే ఇలాంటి వ్యవస్థ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ఫేజ్ ను మరో కొత్త లెవల్ కు తీసుకెళ్లొచ్చు. ఆర్టీఫిషియల్ ఇంటలెజిన్స్ ను మనిషి రోజూవారీ జీవితంలో భాగం చేయొచ్చు. అందుకే గూగుల్ సహా అనేక టెక్ సంస్థలు ఈ చాట్ జీపీటీ తెస్తున్న విప్లవాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget