అన్వేషించండి

Vivo Y21: వివో వై21 వచ్చేసింది.. ఇది సెల్ఫీ స్పెషల్

Vivo Y21 Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ వై21ని లాంచ్ చేసింది. దీని ధర రూ.15,490గా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ అందించారు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వివో వై21 స్మార్ట్ ఫోన్‌ను శుక్రవారం ఇండియాలో విడుదల చేసింది. ఇది మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ డిస్‌ప్లేతో ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. 

వివో వై21 వేరియంట్లు, ధర..
వివో వై21 స్మార్ట్ ఫోన్ డైమండ్ గ్లో, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొత్తం రెండు వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు. హైఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,490గా నిర్ణయించింది. వివో ఇండియా ఈ- స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్‌లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ల కింద దీనిపై డిస్కౌంట్ లభిస్తుంది. 

వివో వై21 స్పెసిఫికేషన్లు.. 
వివో వై21 స్మార్ట్ ఫోన్.. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో రానుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1తో పనిచేయనుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను అదనంగా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేయనుంది. 

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్..
ఇందులో వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. మెయిన్ కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. వివో వై21 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో 18W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ కూడా ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. దీని బరువు 182 గ్రాములుగా ఉంది.

Also Read: Smart Watches: ఈ 8 స్మార్ట్ వాచ్ లు చూడండి.. మీ చేతికి స్మార్ట్ గా కనిపిస్తాయి.. బ్యాటరీ కూడా మామూలుగా ఉండదు

Also Read: Motorola Edge 20: వన్‌ప్లస్ నార్డ్ 2కు గట్టి పోటీ ఇచ్చే మోటొరోలా ఎడ్జ్ 20 వచ్చేసింది.. ఆగస్టు 24 నుంచి సేల్ స్టార్ట్..

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget