Smart Watches: ఈ 8 స్మార్ట్ వాచ్ లు చూడండి.. మీ చేతికి స్మార్ట్ గా కనిపిస్తాయి.. బ్యాటరీ కూడా మామూలుగా ఉండదు
ఒకప్పుడు వాచ్ అంటే.. స్టైల్ కి సింబాలిక్. కానీ రోజులు మారాయి.. ఇప్పుడు అంతా స్మార్ట్ వాచ్ లదే రాజ్యం. వాటి ఫీచర్లూ అనేకం.
స్మార్ట్ వాచ్ అంటే.. స్టైలిష్ మాత్రమే కాదు. అంతకుమించి.. వాటికి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ. పాకెట్ లో ఉన్న మోబైల్ ని చూసుకునే రోజులు పోయాయి. వాచ్ కి వచ్చే.. ఫోన్ నొటిఫికేషన్లు చూసుకుంటే సరిపోతుందనే పరిస్థితి ఉంది. ఫీట్ నెస్ కి సంబంధించి కూడా ఈ స్మార్ట్ వాచ్ లు ఇప్పుడు ఊపేస్తున్నాయి. ఎంత దూరం నడిచాం. హర్ట్ బీట్ ఎంత.. ఇలా చాలా సమాచారాన్ని మనకు అందిస్తుంది. అందుకే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న మోడల్స్ వైపే.. యూజర్స్ చూస్తున్నారు. అందుబాటు ధరలో.. ఎక్కువ రోజులు బ్యాటరీ వచ్చే స్మార్ట్ వాచ్ లను కొంటున్నారు. అలాంటి ఎనిమిది వాచ్ లను మీ కోసం..
బోట్ వాచ్ ఎక్స్‌టెండ్-Boat Watch Xtend
50 రకాల వాచ్ ఫేసెస్‌తో 1.69-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజులపాటు వస్తుందని కంపెనీ తెలిపింది. 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. తొలిసారిగా ఇందులో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఇస్తున్నారు. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ వాచ్ 50మీటర్ల లోతు నీటిలో పడి తడిచినా పాడవకుండా సేఫ్ గా ఉంటుందన్నమాట. హార్ట్‌రేట్ సెన్సర్, ఎస్‌ఈఓ 2, స్ట్రెస్ మానిటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్ ధర రూ. 3,499గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్ లేదా బోట్ వెబ్‌సైట్ నుంచి కొనేసుకోవచ్చు.
రెడ్‌మీ వాచ్ జీపీఎస్-Redmi Watch GPS
రెడ్‌మీ వాచ్‌లో జీపీఎస్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అంతేగాకుండా 11 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 200 వాచ్ ఫేస్‌లను ఇస్తున్నారు. హార్ట్‌రేట్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్స్ ఉన్నాయి. వన్ టూ ఫైవ్ మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసేందుకు ప్రత్యేకంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ గైడ్ ఫీచర్ ఉంది. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వాచ్ నీటిలో తడిచినా పాడు కాదు. 230 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులపాటు బ్యాక్‌అప్ ఉంటుంది. 1.4-అంగుళాల ఫుల్ టచ్ కలర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్ అలారమ్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 3,999.
నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా-Noise Colourfit Ultra
ఈ వాచ్ లలో 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు, 100 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ వాటర్‌ప్రూఫ్‌ను ఇస్తున్నారు. హార్ట్‌రేట్, స్లీప్, స్ట్రెస్ మానిటర్ ఫీచర్స్ ఉన్నాయి. గన్‌మెటల్ గ్రే, క్లౌడ్ గ్రే, స్పేస్ బ్లూ రంగుల్లో ఉంటుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుందట. రూ. 4,499 ధరలో దొరుకుతాయి.
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 3-Noise ColourFit Pro 3
ఈ వాచ్ ప్రత్యేకమేంటంటే.. మహిళల కోసం ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్ అనే ఫీచర్ ఇస్తున్నారు. 210 ఎంఏహెచ్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో 10 రోజులపాటు పనిచేస్తుంది. 1.55-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ ఇస్తున్నారు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తోపాటు 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇతర వాచ్‌లకు భిన్నంగా ఇందులో యూజర్‌కి నచ్చినట్లుగా మార్చుకునేలా క్లౌడ్ వాచ్ ఫేస్‌లు ఉంటాయి. హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ మానిటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్ ధర రూ. 4,499.
క్రాస్‌బీట్స్ ఇగ్నైట్-Crossbeats Ignite
ఈ వాచ్‌లో సోషల్ మీడియా యాక్టివిటీ, కాల్ నోటిఫికేషన్, మెసేజ్ అలర్ట్ ఫీచర్స్ ఉంటాయి. 5 రకాల వాచ్ ఫేస్‌లతో 1.4-అంగుళాల హై డెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 180 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు పనిచేస్తుంది. 6 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌తోపాటు ఐపీ68తో వాటర్, డస్ట్ నుంచి రక్షణ కల్పిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సీబీ ఎక్స్‌ప్లోర్ అనే యాప్ సాయంతో ఎప్పటికప్పుడు యూజర్‌కి పంపుతుంది. ధర రూ. 2,999గా ఉంది.
రియల్‌మీ వాచ్-Realme Watch
రియల్‌మీ స్మార్ట్‌వాచ్ లలో ఇది ఎంట్రీలెవల్ మోడల్. 1.4-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. 160 ఎంఏహెచ్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్, 12 రకాల వాచ్ ఫేస్‌లు, యాక్టివిటీ ట్రాకర్, హార్ట్‌రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, ఫోన్ నోటిఫికేషన్ ఫీచర్లున్నాయి. వాచ్ సాయంతో ఫోన్‌లో మ్యూజిక్, కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు. ధర రూ. 3,499. బ్లాక్ రంగులో లభిస్తుంది.
ఫైర్-బోల్ట్ బీఎస్‌డబ్ల్యూ001-Fire-Boltt BSW001
ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 రోజులు పనిచేస్తుంది. ఐపీఎక్స్7 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. 1.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 200 రకాల వాచ్ ఫేస్‌లు ఉంటాయి. ధర రూ. 2,999. బ్లాక్, బ్లూ, గ్రే, పింక్, గోల్డ్ రంగుల్లో దొరుకుతుంది. మల్టీ స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్‌రేట్, స్లీప్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్‌తోపాటు మ్యూజిక్ కంట్రోల్స్, వైబ్రేషన్ అలర్ట్, కాలర్ ఇన్ఫర్మేషన్ ఫీచర్స్ కూడా ఉంటాయి.
అమేజ్‌ఫిట్ నియో-Amzefit Neo
రెట్రో డిజైన్‌తో 1.2 అంగుళాల మోనోక్రోమ్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్, మెసేజ్ నోటిఫికేషన్లతోపాటు 24X7 హార్ట్‌రేట్ మానిటరింగ్ కోసం పీపీజీ బయో ట్రాకింగ్ ఆప్టికల్ సెన్సర్ ఉంది. ర్యాపిడ్ ఐ మూమెంట్, స్లీప్ ట్రాకర్ ఫీచర్స్ ఉన్నాయి. పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ అసెస్‌మెంట్ సిస్టం పూర్తి హెల్త్ కండిషన్‌ను మానిటర్ చేస్తూ ఆ డేటాను యూజర్‌కి పంపుతుంది. దీనిలో మూడు స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 28 రోజులు, పవర్ సేవింగ్ మోడ్‌లో 37 రోజులు పనిచేస్తుంది. ఇది 5ఏఎంటీ వాటర్ ప్రూఫ్ డిజైన్‌తో తయారైంది. దీని ధర రూ. 2,499.